యువతిపై లైంగిక దాడికి యత్నం!

విజయవాడ: సినిమాలో హీరోయిన్ అవకాశం పేరుతో ఓ యువతిపై లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా
వెలుగులోకి వచ్చింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం భీమవరంలో షూటింగ్ ఉందని కారులో తీసుకెళ్లి తనపై
అఘాయిత్యం చేశారని, తాను ప్రతిఘటించడంతో నిడమానూరు వద్ద కారు ప్రమాదానికి గురైందని, ప్రమాదంలో
గాయాలపాలై చికిత్స పొందిన తర్వాత మరో కారులో బయల్దేరామని, దారిలో మరోసారి అత్యాచార యత్నానికి
ప్రయత్నంచగా వారి నుంచి తప్పించుకొని వచ్చానని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శకుడు చలపతి, హీరో సృజన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.