యుపి సర్కారుకు తొలి షాక్‌

రాష్ట్రం: ఉత్తరప్రదేశ్‌

UP CM
UP CM Yogi

యుపి సర్కారుకు తొలి షాక్‌

ఉత్తరప్రదేశ్‌లో సంచలన విజయం సాధించి అధి కారంలోకి వచ్చిన భార తీయ జనతాపార్టీ ప్రభుత్వానికి అలహాబాద్‌ హైకోర్టు తొలి షాక్‌ ఇ చ్చింది.హిందుత్వ ఎజెండాగా దూకు డుగా వెళ్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కళ్లెం పడేలా హైకోర్టు తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నిర్ణయాలు ప్రజాప్రయోజనాలకు భిన్నంగా ఉంటే న్యాయస్థానాలు బ్రేక్‌వేసే పరిస్థితి ఉందని అలహాబాద్‌ హైకోర్టు తేల్చిచెప్పింది. యోగి ఆదిత్యనాథ్‌ అధికారం లోకి రాగానే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అక్రమ పశువధ కబేళాలపై నిషేధం విధించారు.లైసెన్సులేని మాంసం విక్రయ కేంద్రాలను మూసివేశారు. దీంతో పెద్దఎత్తున విక్రయదారుల నుంచి అలజడిరేగింది.

ఉత్తరప్రదేశ్‌లో మాంసం విక్రయం చాలా వరకు లైసెన్సులేకుండానే జరుగుతుంది. గోరక్షణ పేరుతో ఉద్యమం చేస్తున్న బిజెపి ఎజెండాకు అనుగుణంగా ఆదిత్యనాథ్‌ అధికా రంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే అక్రమ కబేళాలు, అక్రమ మాంసం విక్రయ కేంద్రాలపై కొరడా ఝుళి పించారు.దీంతో ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో వధ శాలలు,విక్రయకేంద్రాలు మూతపడ్డాయి. వీటిపై ఆధా రపడిన వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. సయీద్‌ అహ్మద్‌ అనేక వ్యాపారి తన మాంసం విక్రయ లైసెన్సును ప్రభుత్వం కారణం చూపకుండా రెన్యువల్‌ చేయడం లేదని ఇది తన జీవించే హక్కుకు భంగం కలిగిస్తున్నదని అలహాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.మార్చి 31కి తన లైసెన్సు గడువ్ఞ ముగిసింద ని, రెన్యువల్‌ చేయాలని దరఖాస్తు చేసి అన్ని రకాల నిబంధనలను పూర్తి చేసానని అయినా ప్రభుత్వం లైసెన్సును రెన్యువల్‌ చేయడం లేదని జోక్యం చేసు కొని తన ఉపాధికి రక్షణ కల్పించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. దీనిపై అలహాబాద్‌ హైకోర్టు పిటి షనర్‌ వాదనను ప్రభుత్వ వాదనను విన్న తర్వాత మాంసం విక్రయాలపై నిషేధం విధించడం కారణం లేకుండా లైసెన్సులు రెన్యువల్‌ చేయకుండా నిలిపివే యడం న్యాయబద్ధంకాదని ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఆహారపు అలవాట్లు, ఆహార విక్రయాలు జీవించే హక్కులో భాగమేనని హైకోర్టు తేల్చిచెప్పింది. రాజ్యాంగంలోని 21వ అధికరణం ఆహారపు అల వాట్లు జీవించే హక్కులో భాగమేనని నిర్వచించిందని, పిటిషనర్‌ సయీద్‌ అహ్మద్‌ లైసెన్సును రెన్యువల్‌ చేయకుండా పెండింగ్‌లో ఉంచడం సరైంది కాదని కూడా కోర్టు చెప్పడంతో ప్రభుత్వవర్గాలు అయోమ యంలోపడ్డాయి.

ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకున్న ఆదిత్యనాథ్‌కు ఆదిలోనే న్యాయస్థానం నుంచి ఆటం కం ఎదురైంది. నిజానికి మాంసం విక్రయించడం, మాంసం వినియోగంపై నిషేధం పెట్టినా ఆంక్షలు పెట్టినా అది జీవించేహక్కుకు భంగకరమేనని సాక్షాత్తు హైకోర్టే చెప్పడంతో ప్రభుత్వం తన నిర్ణయంపై డైలమాలోపడింది. యోగి ఆదిత్యనాధ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రయోజనాల కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా రోడ్‌ రోమియోలను నియంత్రించడానికి ప్రత్యేక బృం దాలను నియమించారు. గుండాగిరిని నిరోధించడానికి టాక్స్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్షలోపు సన్న,చిన్నకారుల రైతుల రుణాన్ని మాఫీ చేస్తూ తొలి మంత్రివర్గంలోనే సంచ లన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి పడుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణం తీర్చుకుంటున్నట్లుగా ఆదిత్యనాధ్‌ ప్రకటిం చారు. ఈ నిర్ణయాలపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవ్ఞతున్నా మాంసంవిక్రయాలు,వినియోగంపై ఆంక్ష లు విధించడమే ఆదిత్యనాథ్‌ విమర్శలకు గురికావల్సి వస్తోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ఓ సామాజిక వర్గం ఈ నిర్ణయం వల్ల పెద్దఎత్తున దెబ్బతినే ప్రమా దంఏర్పడింది.ముఖ్యంగా ఆవర్గానికి ఉపాధి కరవయ్యే పరిస్థితి ఏర్పడడంతో ఆదిత్యనాథ్‌ నిర్ణయాన్ని సవా ల్‌చేస్తూ వ్యాపారికోర్టుకు వెళ్లడం కోర్టు సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి బ్రేక్‌పడింది. ఏంతినాలి అనేది ప్రజల వ్యక్తిగత నిర్ణ యం. అది వారి ఆహారపు అలవాటు. దీనిని ఎవరూ శాసించలేరు.

కొందరు పూర్తిగా వెజిటేరియన్లు అయితే మరికొందరు పూర్తిగా నాన్‌వెజిటేరియన్లు. అది వారి వారి వ్యక్తిగత నిర్ణయం. దీంట్లో ప్రభుత్వం చేసుకో కూడదు. ప్రజలు ఫలానా ఆహారమే తీసుకోవాలని శా సించడం ప్రాథమికహక్కులను భంగపర్చడమేనంటూ హైకోర్టు తీర్పుఇవ్వడంతో జోష్‌లోఉన్న ఆదిత్యనాధ్‌ కొంత వెనక్కితగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదే శ్‌లో అనూహ్యవిజయం సాధించిన బిజెపి అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పదవిని మఠాధిపతిగా ఉన్న ఆదిత్యనాథ్‌కు అప్పజెప్పింది. కాషాయదుస్తులు వేసు కొని విధులు నిర్వర్తిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఒక ఆదిత్యనాథ్‌ అనేచెప్పొచ్చు. ఘనవిజయం తర్వాత యుపి ముఖ్యమంత్రి పదవికి పలుపేరు ్లపరిశీలనలోకి వచ్చాయి.ఇందులో ఉత్తరప్రదేశ్‌లో విజయవంతమైన సిఎంగా పేరుతెచ్చుకున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ పేరు కూడా తెరపైకివచ్చింది.అయినా బిజెపిఅధినేత అమిత్‌ షా ప్రధాని నరేంద్రమోడీలుమాత్రం హిందూత్వపక్షపా తులనే ముద్రపడుతుందనే ప్రచారాలకు వెనకడుగు వేయకుండా సాహసంగా కాషాయవస్త్రధారి ఆదిత్య నాథ్‌ను ముఖ్యమంత్రిపీఠంపై కూర్చొబెట్టారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయపరిణతిని ప్ర దర్శించకుండా ఇష్టారాజ్యంగా నిర్ణయాలుతీసుకోవడం తోనేవివాదాలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి.

– మిట్టపల్లి శ్రీనివాస్‌