యుపిలో బిజెపి, కర్ణాటకలో కాంగ్రెస్‌

CONGRESS,BJP
CONGRESS,BJP

యుపిలో బిజెపి, కర్ణాటకలో కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: దేశంలోని ఆరురాష్ట్రాల్లో ఖాళీ ఏర్పడిన 25 రాజ్యసభ స్థానాలకుగాను శుక్రవారం ఎన్నికలు జరిగాయి. పార్టీల వ్యూ హాలు తారస్థాయికి చేరడంతో యుపి, కర్నాటక వంటి రాష్ట్రాల ఎన్నికలుప్రతిష్టాత్మకంగా మా రాయి. వాస్తవంగా బిజెపి మాత్రం పదిస్థానాలకు తగ్గకుండా సాధించగలమని చెపుతోంది. మొత్తం 58స్థానాలకు గాను 33 మంది అభ్యర్ధులు పది రాష్ట్రాలనుంచి ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఎన్నికయ్యారు. ఈనెల 15వ తేదీనే వారి ఎన్నిక పూర్తయింది. ఏడుగురు కేంద్రమంత్రులు వీరిలో ఉన్నారు. వారిలో రవిశంకర్‌ప్రసాద్‌; ప్రకాష్‌ జవ ్‌దేకర్‌,కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వంటి వారు న్నారు. ఉత్తరప్రదేశ్‌నుంచి అరున్‌జైట్లీ పోటీ చేస్తున్నారు. ఇక పశ్చిమబెంగాల్‌, కర్నాటక, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘర్‌,తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్య సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో జరిగిన నాలుగుస్థానాల ఎన్నికలనున నిలిపివే యాలని తిరిగి నిర్వహించాలని జెడిఎస్‌ డిమాం డ్‌చేసింది.