యుపిలో ఇద్దరు ఎస్పి నేతల హత్య

murder
murder

లక్నో:ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు దారుణహత్యకు గురయ్యారు. శుక్రవారం జరిగిన ఈ దారుణ హత్యలు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. జాన్‌పూర్‌ జిల్లాలోని సిద్ధిఖిపూర్‌లో లాల్జి యాదవ్‌(41)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. వ్యక్తిగత శతృత్వం వలనే లాల్జి యాదవ్‌ హత్యకు గురయ్యాడని పోలీసులు స్పష్టం చేశారు.
ఇక గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌ జిల్లా అధ్యక్షుడు రామ్‌టేక్‌ ఖటారియాను కూడా కిరాతకంగా చంపేశారు. ఆయన తన ఇంటి సమీపంలో నిర్మాణ పనులను పరిశీలిస్తుండగా గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు 10 రౌండ్ల కాల్పులు జరపడంతో ఖటారియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి హత్యలకు రాజకీయ కారణాలు లేవని కేవలం శతృత్వం వేల్ల ఈ హత్యలు జరిగాయని పోలీసులు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/