‘యుద్ధం శరణం 8న గ్రాండ్‌ రిలీజ్‌

Yudham Saranam
Yudham Saranam

‘యుద్ధం శరణం సెన్సార్‌ పూర్తి: సెప్టెంబర్‌ 8న గ్రాండ్‌ రిలీజ్‌

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై కృష్ణ ఆర్‌వి మారి ముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘యుద్ధం శరణం . సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ ఈచిత్రంలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.. లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది..ఈసినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది.. ఈసందర్భంగా వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడారు.. అక్కినేని నాగచైతన్య నటనలోని మరో యాంగిల్‌ను సరికొత్తగా ప్రెజెంట్‌ చేస్తూ కృష్ణ ఆర్‌ వి మారి ముత్తు దర్శకత్వంలో రూపొందిన ఫుల్‌లెంగ్త్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ అన్నారు.. ఈచిత్రం సెన్సార్‌ పూర్తిచేసుకుని యు ఎ సర్టిఫికెట్‌పొందిందన్నారు..ప్రేక్షకులు, అక్కినేని అభిమానులను అలరించేలా యుద్ధం శరణం ఉంటుందన్నారు..