యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు

Pranay, Kashyap
Pranay, Kashyap

యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌కు 

అనాహైమ్‌:యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ఫ్రీ గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్లు పారుపల్లి కశ్యప్‌, హెచ్‌ఎస్‌ ప్రణ§్‌ు ఫైనల్లోకి దూసుకెళ్లారు. 21 నెలల తర్వాత కశ్యప్‌ ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్‌కు చేరడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో భాగంగా రెండో సెమీఫైనల్లో కొరియాకు చెందిన క్వాంగ్‌ హీ హెయోపై 15-21, 21-15, 21-16తో విజయం సాధించాడు.

మరో మ్యాచ్‌లో హెచ్‌ ఎస్‌ ప్రణ§్‌ు వియత్నాంకు చెందిన తియెన్‌ మిన్‌ ఎన్గుయెన్‌ఫై 21-14, 21-19తో గెలుపొందాడు. ఓ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు చెందిన ఇద్దరు షట్లర్లు ఫైనల్లో తలపడటం ఇది రెండో సారి. ఈఏడాది ఏప్రిల్‌లో జరిగిన సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్లో భారత్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌ తలపడిన సంగతి తెలిసిందే. ఈపోరులో సాయి ప్రణీత్‌ విజయం సాధించిన విజయం తెలిసిందే. అంతకముందు పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ ప్రణ§్‌ు 10-21, 21-15, 21-18 తేడాతో జపాన్‌ క్రీడాకారుడు కంటట్యునియామపై విజయం సాధించగా పారుపల్లి కశ్యప్‌, సమీర్‌ వర్మ మధ్య జరిగిన ఈమ్యాచ్‌లో కశ్యప్‌ 21-13, 21-16తేడాతో కశ్యప్‌ విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. ఫైనల్లో కశ్యప్‌, ప్రణ§్‌ు తలపడనున్నారు.