యుఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌కు

Pranay, Kashyap
Pranay, Kashyap

యుఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌కు

అనాహైమ్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ఫ్రీ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారులు పారుపల్లి కశ్యప్‌, హెచ్‌ఎస్‌ ప్రణ§్‌ు సెమీస్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ ప్రణ§్‌ు 10-21, 21-15, 21-18 తేడాతో జపాన్‌ క్రీడాకారుడు కంటట్యునియామపై విజయం సాధించాడు. ఈ ఇద్దరు తలపడటం ఇదే తొలిసారి. సెమీస్‌లో ప్రణ§్‌ు వియత్నాం క్రీడాకారుడు టిన్‌ మిన్‌తో తలపడనున్నాడు. మరో క్వార్టర్‌ ఫైనల్‌లో ఇద్దరు భారత క్రీడాకారులు తలపడ్డారు. పారుపల్లి కశ్యప్‌, సమీర్‌ వర్మ మధ్య జరిగిన ఈమ్యాచ్‌లో కశ్యప్‌ విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. సుమారు 40నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-16తేడాతో కశ్యప్‌ విజయం సాధించాడు.కశ్యప్‌ సెమీస్‌లో చైనా క్రీడాకారుడు క్వాంగ్‌ హీతో తలపడనున్నాడు.