యుఎస్‌లో మహేష్‌ సినిమా పనులు

DEVI SRI PRASAD
DEVI SRI PRASAD

యుఎస్‌లో మహేష్‌ సినిమా పనులు

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అనే నేను సినిమాలో నటిస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌బాబ ఆచిత్రం పూర్తవగానే వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్న వంశీ పైడిపల్లి చిత్రం పనుల్ని ఇంకాస్త వేగవంతం చేశారు. చిత్రం సంగీతానికి సంబంధించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ప్రారంభించారు.. అది కూడ యుఎస్‌లో కావటం విశేషం.. ఈ సిట్టింగ్స్‌లో నిర్మాత దిల్‌ రాజు కూడ పాల్పంచుకుంటున్నారు.. మరి మహేష్‌కు ‘నేనొక్కడినే, ‘శ్రీమంతుడు వంటి బ్లాక్‌ బస్టర్‌ ఆల్బమ్స్‌ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ ఈచిత్రానికి ఎలాంటి మ్యూజిక్‌ అందిస్తారో చూడాలి.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం మొదలు కానుంది.. ఇకపోతే ప్రస్తుం మహేష్‌ కొరటాల సినిమా షూటింగ్‌ ప్రత్యేకంగా వేసిన సిఎం ఛాంబర్‌ సెట్‌లో జరుగుతోంది.