యిప్పీ నూడిల్స్‌కోసం మూడ్‌ మసాలా

ITC
ITC

యిప్పీ నూడిల్స్‌కోసం మూడ్‌ మసాలా

హైదరాబాద్‌, ఆగస్టు 21: ఐటిసి ఫుడ్స్‌నుంచి కొత్తగా యిప్పీ మూడ్‌ మసాలాను ప్రారంభిం చింది. నూడిల్న్‌ నచ్చినరీతిలో తినేందుకు కస్టమర్లకు కొత్త అభిరుచులను చేరువచేస్తోంది. ప్రతి మూడ్‌మసాలా ప్యాకెట్‌లోని రెండు మసాలా మిక్స్‌ సాచేలు వాడితే నూడిల్స్‌కు కొత్త రుచులు అద్దినట్లవుతుందని ఐటిసి ప్రచారం చేస్తోంది. ప్రతి మూడ్‌ మసాలా నూడిల్స్‌లో రెండు మసాలా ప్యాకెట్లు ఉంటాయని, మూడ్‌ మిక్స్‌ వండుతున్నపుడు మసాలా మిక్స్‌ పెద్ద ప్యాకెట్‌ని పూర్తిగా వేసి, మూడ్‌ రుచికి తగి నంతగా మిక్స్‌జోడించుకోవచ్చని ఐటిసి ఫుడ్‌్‌స చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ హేమంత్‌ మాలిక్‌ అన్నారు. అన్ని వాణిజ్యవ్యాపార దుకాణాల్లో ఈ ప్యాక్‌ రూ.15లను, నాలుగు ప్యాక్‌లు రూ.55ధరకు లభిస్తున్నాయన్నారు. దేశంలో ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌కు బ్రాండెడ్‌ కంపెనీల ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా యిప్పీ నూడిల్స్‌పరంగా కొత్త విభిన్న రుచుల మషాలాలను అందించి ఐటిసి తన మార్కెట్‌ వాటాను మరింత పెంచుకోవాలని చూస్తోంది.