యాసంగి పంటకు నీటి విడుదల

Harish Rao
Harish Rao

నల్గొండ: తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇవాళ నల్గొండ జిల్లాలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ నుంచి యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు మంత్రి హరీశ్‌రావు. అయితే, 1950 డిసెంబర్‌ 10న భారత తొలి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా పనులు ప్రారంభించగా.. 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌రావు నీటిని విడుదల చేశారు. అంతకు ముందు సాగర్‌ వద్ద నెహ్రూ విగ్రహానికి మంత్రి హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.