యావత్‌ దేశానికే తెలంగాణ దిక్సూచి

KTR
KTR

యావత్‌ దేశానికే తెలంగాణ దిక్సూచి

రాబోయే రోజుల్లో నేతలు సమర్థంగా పనిచేయాలి
తెలంగాణ ప్రయోజనాలకు టిఆర్‌ఎస్‌ రక్షణ కవచం
ప్రజలకు కెసిఆర్‌తో పేగుబంధం ఉంది
‘మీట్‌ ది ప్రెస్‌లో టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌

హైదరాబాద్‌: దేశానికే తెలంగాణ దిక్చూచి కావాలని.. ఇందుకోసం రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కోరారు. ఇటీవల యుద్ధంలో గెలిచి సంతోషంగా ఉన్న కార్యకర్తలు.. భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటుచేసిన ‘మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఇది చారిత్రాత్మక విజయమని తాను జీవించి నంతవరకూ ఈ విజయాన్ని మరిచిపోలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు చారిత్రాత్మకమంటే తెలంగాణలో తొలి సార్వత్రిక ఎన్నికలు కెసిఆర్‌ ఒకవైపు, నాలుగు పార్టీలు మరోవైపు ఉంటే.. కెసిఆర్‌కు విజయాన్ని అందించారని కెటిఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు కెసిఆర్‌ను తమ గుండెల్లో ఎంతగా ప్రతిష్టించుకున్నారో ఈ ఫలితాల్లో తేటతెల్లమైందన్నారు. చిరస్మరణీయమైన ఈ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకంగా శిరస్సువంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, ప్రజల స్వీయ రాజకీయమే శ్రీరామరక్షని కెసిఆర్‌, జయశంకర్‌ సార్‌ చెబుతుండేవారని కెటిఆర్‌ గుర్తు చేశారు. ప్రజా నిర్ణయమే అందరికీ శిరోధార్యమని.. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్‌ ప్రభుత్వం సానుకూల ఓట్లతో విజయం సాధించడం అసాధారణ విషయమన్నారు. ఈ ఎన్నికల్లో 98 లక్షల ఓట్లు టిఆర్‌ఎస్‌కు పడ్డాయనీ, టిఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌కు మధ్య 42 లక్షల ఓట్ల వ్యత్యాసం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధించామన్నారు.

100 స్థానాల్లో బిజెపి డిపాజిట్లు గల్లంతు చేస్తామని ఆరోజు చెప్పిన విధంగానే 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని కేటిఆర్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు టిఆర్‌ఎస్‌ రక్షణ కవచంగా నిలిచిందని.. తెలంగాణ ప్రజలు..కేసిఆర్‌ పేగుబంధం ఉందని కేటిఆర్‌ వ్యాఖ్యానించారు. తెలం గాణ ప్రజలను రాజకీయ శక్తిగా మార్చింది టిఆర్‌ఎస్‌ అని తెలిపారు. దేశ రాజకీ యాల్లో కీలకపాత్ర పోషించాలని నిర్ణయించుకున్న సిఎం కేసిఆర్‌ తనకు గురుతర మైన బాధ్యతను అప్పజెప్పడం జరిగిందన్నారు. తనను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించిన కేసిఆర్‌ పాదాభివందనం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్రత్యక్షంగా నాలుగు ఎన్నికల్లో పోటీ చేశానని, పరోక్షంగా 8 ఎన్నికల్లో పనిచేశానన్నారు.టిఆర్‌ఎస్‌ పటిష్టమైన నిర్మాణం అవసరం ఉంద న్నారు.

క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకెళ్లడం అవసరం ఉందన్నారు. మా ముం దున్న సవాల్‌..ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చడం పంచాయతీ, పార్లమెంటు, మున్సిపల్‌, సొసైటీ, జిల్లా మండల పరిషత్‌ ఎన్నికలకు సమర్థవంతంగా ఎదుర్కొవడం..ఇవన్నీ రాబోయే ఆరేడు నెలల కాలంలో జరుగుతాయన్నారు. పార్టీ నాయకుల సహకారంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని..తెలంగాణ ప్రజలు 88 స్థానాలను కట్టబెట్టి గురుతరమైన బాధ్యతలను కట్టబెట్టారని కేటిఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో టిఆర్‌ఎస్‌ 15 పార్లమెంటు స్థానాలోల స్పష్టమైన ఆధిక్యత ఉందని కేటిఆర్‌ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో 16 ఎంపీ స్థానాల్లో గెలిస్తే..ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? దేశంలో ఎలాంటి విధానాలు అవసరం? వంటి అంశాల్లో కీలకపాత్ర పోషించవచ్చన్నారు. దేశవ్యాప్తంగా పేదవర్గాల ముఖాల్లో సంతోషం నింపే సంక్షేమ కార్యక్రమాలు అమ లు కావాలన్నారు. తెలంగాణను దేశానికి దిక్చూచిగా తీసుకుపోవాలన్నారు. అం దుకుదగ్గ కృషి చేస్తామన్నారు.

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే టిఆర్‌ఎస్‌ నిర్ణయాత్మక పాత్ర పోషించాల న్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం వచ్చిందని.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం రాలేద న్నారు. ఇతరుల సహకారంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నా రన్నారు. 2019 ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ స్వయంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని..ఒక రాష్ట్రం లో సంకీర్ణ ప్రభుత్వం ఉందన్నారు. 16 రాష్ట్రాల్లో బిజెపి, మరికొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయని కేటిఆర్‌ పేర్కొన్నారు.