యాపిల్‌ సంపద లక్షకోట్ల డాలర్లు!

apple
apple

ముంబై: ప్రపంచమార్కెట్లలో తొలిసారి ఒక కంపెనీ లక్షకోట్ల (ట్రిలియన్‌) డాలర్ల మార్క్‌కు చేరువవుతోంది. ఇలాంటి చరిత్రాత్మక రికార్డు బాటలో సాగుతున్న దిగ్గజం అమెరికన్‌ టెక్‌ బ్లూచిప్‌ యాపిల్‌. సరికొత్త టెక్నాలజీ, అత్యంత భద్రత, తిరుగులేని నాణ్యత వంటి ఫీచర్లతో విలాసవంత స్మార్ట్‌ఫోన్ల మారెటింగ్‌లో ఐఫోన్ల మార్కెట్‌ను ఐఫోన్ల ద్వారా టెక్‌ దిగ్గజం యాపిల్‌ శాసిస్తోంది. ప్రస్తుం యాపిల్‌ షేరు 180 డాలర్ల వద్ద కదులుతోంది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ కేపిటలైజేషన్‌ 900బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరింది. నిజానికి 1990లో టెక్నాలజీ బూమ్‌కు తెరలేచినప్పుడు తొలిసారి అమెరికన్‌ దిగ్గజం సిస్కో సిస్టమ్స్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదురుతూ వచ్చింది. 2000 మార్చికల్లా సిస్కో సిస్టమ్స్‌ మార్కెట్‌ వేల్యూ 550 బిలియన్‌ డాలర్లను తాకింద. దీంతో మరికొద్ది కాలంలోనే ట్రిలియన్‌ డాలర్‌ కంపెనీగా రికార్డు సృష్టిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. 2008లో ఆర్థిక సంక్షోభం ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టడంతో సిస్కో సిస్టమ్స్‌ మార్కెట్‌విలువ సైతం దెబ్బతీసింది. సుమారు రెండు దశాబ్దాల తరువాత కూడా కంపెనీ మార్కెట్‌ విలువ రికార్డు గరిష్టానికంటే ఎంతో దిగువన ఉండిపోయింది. ప్రస్తుతం సిస్కో మార్కెట్‌ కేప్‌ 221 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అంటే 87 శాతం విలువ కోల్పోయినట్లయింది. ప్రపంచంలోనే తొలిసారి ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా నిలిచేందుకు యాపిల్‌కు అవకాశాలున్నాయన్నది అత్యధిక శాతం మంది విశ్లేషకుల అంచనా. ఇందుకు పలు కారణాలను చూపుతున్నారు. 2012 తరువాత యాపిల్‌ సొంత షేర్ల కొనుగోలు చేపట్టింది. ఫలితంగా అప్పట్లో పబ్లిక్‌కు అందుబాటులో ఉన్న 6.6బిలియన్‌ షేర్లు 5.07బిలియన్లకు తగ్గాయి. అంటే ఈక్విటీ షేర్ల సంఖ్యలో 23శాతం కోతపడింది. తాజాగా 210బిలియన్‌ డాలర్లతో మరో బైబ్యాక్‌కు రెడీ అంటోంది. 2019 మార్చికల్లా బైబ్యాక్‌ను పూర్తిచేసే యోచనలో ఉంది. ఇకపై పలు కంపెనీలు బైబ్యాక్‌ చేపట్టేందుకు అమెరికా ప్రెసిడెంట్‌ తీసుకువచ్చిన పన్నుకోతల సంస్కరణలు దోహదపడనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సుప్రసిద్ధ ప్రపంచ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ ఇటీవల యాపిల్‌ కంపెనీపై మమకారాన్ని పెంచుకున్నట్లు పేర్కొనడం షేరుకి బూస్ట్‌ను ఇవ్వనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. నిజానికి బఫెట్‌ టెక్నాలజీ షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌కు దూరంగా ఉండే విషయం తెలిసింఏద. అర్ధంకాని బిజినెస్‌లు నిర్వహఙంచే కంపెనీలలో పెట్టుబడికి బఫెట్‌ ప్రాధాన్యం ఇవ్వరు. అయితే తాజాగా తన దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హాథవే పోర్ట్‌పోలియోలో రెండో పెద్ద కంపెనీగా యాపిల్‌కు చోటు లభించినట్లు పేర్కొనడంతో మార్కెట్‌ వర్గాలు ఆశ్చర్యపోయాయి కూడా. పోర్ట్‌పోలియో తొలి స్థానంలో 2008 సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగ్‌ సంస్థ వెల్స్‌ఫార్గో నిలవడం మరో విశేషం. అయితే బఫెట్‌ ఇప్పటికీ వెల్స్‌ఫార్గో పట్లఆసక్తిని చూపుతుండటం విశేషం. అమెరికన్‌ ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ మార్కెట్‌కేపిటలైజేషన్‌ ర్యాంకులో యాపిల్‌ వెనుకే పరుగుతీస్తున్న అంశాన్ని విశ్లేషకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్‌ మార్కెట్‌ కేప్‌ 732 బిలియన్‌ డాలర్లు కాగా, ఇండియా వంటి వర్ధమాన దేశాలలో వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటాన్ని పేర్కొంటున్నారు.