యాదాద్రి నుంచి మోత్కుపల్లి ప్రచారం

motkupalli narasimhulu
motkupalli narasimhulu

యాదాద్రి: ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు టిడిపి బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆలేరుకు గోదావరి జలాలు అందించడమే తన అంతిమ లక్ష్యం అని చెప్పారు. ఆలేరుకు గోదావరి జలాలు అందించి రాజకీయ జీవితాన్ని ముగిస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. ఈ నెల 27న యాదాద్రి నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు మోత్కుపల్లి వెల్లడించారు.