యాదాద్రిలో చక్రతీర్థ స్నానం

Yadadri
ఇంటర్నెట్ డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం చక్రతీర్థస్నానం నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో వేద మంత్రాలతో భక్తజనుల మధ్య శ్రీ చక్ర ఆళ్వారుడికి పుణ్యస్నానం జరిపించి వేదపండితులు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. పదిరోజులుగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీచక్ర ఆళ్వారుడితో శ్రీలక్ష్మీ నరసింహస్వామివారికి సేవోత్సవం జరిగింది. యువకుల కేరింతలు, మంగళవాయిద్యాల నడుమ తిరువీధుల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది.