యాదాద్రికి నిధుల కొరత లేదు

KCR
KCR

హైదరాబాద్‌: ఆధ్యాత్మిక ఉట్టిపడేలా, అద్భుత శిల్పకళానైపుణ్యంతో, ఆలయ ప్రాశస్థ్యం, వైభవం ప్రస్పుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలని సియం కేసిఆర్‌ అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణపనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్‌లో కూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తైన తర్వాత సహస్రాష్టక కుండయాగం(1008 యాగకుండలతో) 11 రోజులపాటు నిర్వహించనున్నట్లు సియం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామన్నారు. యాదాద్రి పునరుద్ధరణ పనులను ఆదివారం సందర్శించి వచ్చిన సియం కేసిఆర్‌, సోమవారం నాడు ప్రగతిభవన్‌లో విస్తృత స్థాయి సమీక్ష భాగంలో ఎలాంటి నిర్మాణాలు సందర్భంగా ప్రధాన ఆలయమున్న గుట్టపై భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? టెంపుల్‌ సిటీప ఎలాంటి నిర్మాణాలు రావాలి? మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకున్నారు. మాడవీధులు, ప్రాకారాలు కలుపుకుని 4.5 ఎరరాల విస్తీర్ణంతో ప్రధాన దేవాలయం నిర్మించాలని సియం కేసిఆర్‌ చెప్పారు. కొండ పైభాగంలో ఈఓ కార్యాలయం, వివిఐపి గెస్ట్‌హౌస్‌, వైవేద్యం వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామివారి పుష్కరిణి, మెట్లదారి, బస్‌స్టేషన్‌, హెల్త్‌ సెంటర్లు ఉండాలని నిర్ణయించారు.
శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి ,నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి ,తలనీలాల సమర్పణకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలని సియం ఆదేశించారు. గుట్టపైకి వెళ్లడానికి ఒక దారి, రావడానికి ఒక దారి ఏర్పాటు చేయాలని చెప్పారు.