యదార్థ ఘటన ఆధారంగా డేగల శ్రీను!

OPENING1
DEGALA SRINU Opening

యదార్థ ఘటన ఆధారంగా డేగల శ్రీను!

ఆర్‌.ఎఫ్‌.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై అమర్‌నాథ్‌ మండూరి దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం బుదవారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి సాగర్‌ క్లాప్‌ కొట్టగా, బాబూ మోహన్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వి.సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. దర్శక నిర్మాత అమర్‌నాథ్‌ మండూరి మాట్లాడుతూ.. గుంటూరులో జరిగిన ఓ యదార్థ ఘటనను ఆధారంగా చేసుకుని, దానికి కొన్ని కల్పితాలు జోడించి డేగల శ్రీను సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో అందరూ హీరోలే, అందరూ విలన్లే. యూత్‌ ఈగో సమస్యలతో 50 హత్యలకు ఎలా దారి తీసిందనేదే ఈ సినిమా కథ. కాశ్మీర్‌కు చెందిన జహీదా శ్యామ్‌ హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. ఇరవై రోజుల తర్వాత గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం. రెండు షెడ్యూల్స్‌లో 80 రోజుల పాటు చిత్రీకరణ చేయబోతున్నాం. సమాజంలో పోలీసు వ్యవస్థ అవశ్యకతను తెలియజేసే విధంగా కూడా సినిమా ఉంటుందని తెలిపారు.