యడ్యూరప్ప నేతృత్వంలో రథయాత్ర

YEDDYRAPPA
YEDDYRAPPA

తిరువనంతపురం: కేరళలోని ముత్తూర్‌ నుంచి బిజెపి తలపెట్టిన సేవ్‌ శబరిమల రథయాత్రను ఆ పార్టీ నేత బిఎస్‌ యడ్యూరప్ప ప్రారంభించారు. స్వామి అయ్యప్ప ఆతయంపై సుప్రీం వెలువరించిన తీర్పును కేరళ ప్రభుత్వం అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి నేతలు ముత్తూర్‌ నుంచి శబరిమల దాకా రథయాత్రను కొనసాగించాలన్నారు. కేరళ బిజెపి చీఫ్‌ శ్రీధరన్‌ కలిసి యడ్యూరప్ప ఈ రథయాత్రను ప్రారంభించారు. కాగా ఇందులో పాల్గొనేవారంతా ఈ నెల 30న శబరిమల చేరుకుంటారని యడ్యూరప్ప తెలిపారు. ఇవాళ ముత్తూర్‌ నుంచి ప్రారంభమైన రథయాత్ర ఈ నెల 30న శబరిమల చేరుకుంటుంది.