యంగ్‌టైగర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌

NTR, TRIVIKRAM-1
NTR, TRIVIKRAM

యంగ్‌టైగర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం కోసం ఎంతో కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతోంది.. ఎన్టీఆర్‌ చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది.. సంగీతం థమన్‌ అందిస్తుండగా, పిఎస్‌ వినోద్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడారు. ఈచిత్రంను నిర్మిచటం చాలా హ్యాపీగా ఉందన్నారు. ఏప్రిల్‌లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. కాగా జులాయి,సన్నాఫ్‌ సత్యమూర్తి, అ..ఆ, వంటి ఘన విజయాలు సాధించిన చిత్రాలను హారిక అండ్‌హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన సంగతి విదితమే.