యంగిండియాకు బిసిసిఐ భారీ నజరానా

BCCI
BCCI

ముంబై: ఐసిసి అండర్‌-19 క్రికెట్‌ టోర్నీలో విశ్వ విజేతగా నిలిచిన భారత యువ జట్టుకు బీసిసిఐ భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 30 లక్షలు, కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు రూ.50 లక్షలు ,సహాయ సిబ్బందిలోని ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు అందిస్తున్నట్లు బిసిసిఐ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. సెమీ ఫైనల్లో పాక్‌పై విజయం సాధించిన అనంతరమే భారత యువ జట్టుకు నజరానా ప్రకటిస్తామని బిసిసిఐ ముందుగానే తెలిపింది.