మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేకం

LADIES
LADIES

విజ‌య‌వాడః అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేకంగా లైసెన్స్ మేళా నిర్వహించనున్నట్లు కృష్ణాజిల్లా ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ తెలిపారు. విజయవాడలోని ఆర్టీఏ కార్యాలయంలో ఈనెల 8న జరిగే ఎల్ఎల్ఆర్ మేళాకు హాజరు కావాలని మహిళలు, యువతులకు సూచించారు. ఈ మేళాకు హాజరయ్యే మహిళలు ముందుగా సమీపంలోని ఈ సేవ, మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా ఎల్ఎల్ఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా నిర్దేశిత రుసుము చెల్లించి ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజరు కావాలని ఉప రవాణా కమిషనర్ మీరాప్రసాద్ సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ఎల్ఆర్ కోసం వచ్చే మహిళల కోసం విజయవాడ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎల్ఎల్ఆర్ పొందిన నెల రోజుల తర్వాత గన్నవరంలో జరిగే డ్రైవింగ్‌ పరీక్షకు హాజరై లైసెన్సు పొందవచ్చని తెలిపారు.