మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శ్రీశైలంలో ఏర్పాట్లు

srisailam temple
srisailam temple

శ్రీశైలంః శ్రీశైలక్షేత్రంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దేవస్థానం భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు కల్పిస్తోంది. తాత్కాలిక సదుపా యాల కల్పన ప్రారంభమయింది. ఇందులో భాగంగా ఆలయ మాడవీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్ల సామ ర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా కంపార్ట్‌మెం ట్లను విస్తరింపజేస్తున్నారు. శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 11రోజులపాటు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేసేందుకు దేవస్థానం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసింది.