మ‌వోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో భారీగా పెరిగిన డాటా వినియోగం!

bsnl
bsnl

ఢిల్లీ: దేశంలోని మ‌వోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బీఎస్‌ఎన్ఎల్ డేటా వినియోగం భారీగా పెరిగింద‌ని, వామపక్ష భావజాలం ఉన్న 9 రాష్ట్రాల్లో 2జీ నెట్ వర్క్‌పై రోజుకు 400 జీబీ డేటా వినియోగం జ‌రుగుతుంద‌ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు బీఎస్ఎన్ఎల్, వీఎన్ఎల్ సంయుక్తంగా ప్రకటించాయి. నక్సల్స్ ఏరియాలో హింసను అరికట్టడంతో పాటు సమాచారాన్ని త్వరగా తెలుసుకునేందుకు వీలుగా 2013లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని అప్పటి కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా 2016 డిసెంబర్ నాటికి సౌర విద్యుత్ ద్వారా పని చేసే 2,199 బీఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దాదాపు 20 వేల గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. దీని ప్రకారం నక్సల్స్ ఏరియాల్లో బీఎస్ఎన్ఎల్ డేటా వినియోగం బాగా పెరిగిందని అధికారులు తెలిపారు.