మ‌రో ప్ర‌ముఖ న‌టుడు రాజ‌కీయాల్లోకి..!

Vijay
Vijay

చెన్నైః తమిళనాడులో పెద్ద ఎత్తున సినీనటులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తోన్న విషయం తెలిసిందే. అక్కడి అగ్రనటుల్లో ఒకరైన విజయ్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించే క్రమంలో ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నానంటూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, చడీచప్పుడూ లేకుండా ప్రజా సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని విజయ్‌ ప్రజా సంఘం నిర్వాహకులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.