మ‌రో అరుదైన రికార్డు సాధించిన ధోని

M S Dhoni
M S Dhoni

శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టీ20లో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరో రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక మందిని అవుట్ చేసిన కీపర్‌గా అరుదైన రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్‌లో క్యాచ్ పట్టుకోవడం ద్వారా ఉపుల్ తరంగను, స్టంపౌట్ ద్వారా అసెల గుణరత్నె, థిసారీ పెరీరాలను ధోనీ పెవిలియన్ పంపాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ కుశాల్ పెరీరా ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసి పట్టుకోవడం ద్వారా అతడిని ఔట్ చేశాడు.
కటక్ మ్యాచ్‌లో మొత్తం నలుగురు శ్రీలంక ఆటగాళ్లను పెవిలియన్ పంపాడు. వీరితో కలిపి ఇప్పటి వరకు 200 మందిని ధోనీ ఔట్ చేశాడు. ఫలితంగా టీ20ల్లో అత్యధిక మందిని పెవిలియన్‌కు పంపిన కీపర్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. 207 మందిని ఔట్ చేసిన పాకిస్థాన్ కీపర్ కమ్రాన్ అక్మల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో కుమార సంగక్కర (192), దినేశ్ కార్తీక్ (167), డి.రామ్‌దిన్ (152) కొనసాగుతున్నారు.