మ‌రో అణు ప‌రీక్ష‌కు సిద్ద‌మ‌వుతున్న ఉత్త‌ర‌కొరియా?

North korea
North korea

సియోల్ః వచ్చే వారం అమెరికా, దక్షిణకొరియా సంయుక్తంగా నావికా దళ విన్యాసాలు చేపట్టనున్నాయి. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రకొరియా అణు ప‌రీక్ష‌కు సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. అణు ప‌రీక్ష‌కు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకుంద‌ని ద‌క్షిణ కొరియా మీడియా ద్వారా తెలిసింది.ఉత్త‌ర‌కొరియా మధ్యంతర స్థాయి క్షిపణులను ప్రయోగించనున్నట్లు స‌మాచారం. ఇందుకు సంబంధించిన‌ శాటిలైట్‌ చిత్రాలు బయటకు వచ్చాయి. హవసాంగ్‌-14 ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)తో పాటు హవసాంగ్‌-13 ఐసీబీఎంను కూడా ఉత్త‌ర‌కొరియా ప‌రీక్షించే అవ‌కాశం ఉంది.