మ‌రుగుదొడ్లు నిర్మించ‌లేద‌ని బిజిలీ బంద్‌

power cut
power cut

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో మరుగుదొడ్ల నిర్మాణంపై అలసత్వం వహిస్తున్న లబ్ధిదారుల ఇళ్లకు విద్యుత్‌ సరఫరాను శుక్రవారం నిలిపివేశారు. గ్రామంలో మొత్తం 347 మరుగుదొడ్లు మంజూరుకాగా.. 64 మంది లబ్ధిదారులు వాటిని నిర్మించుకోలేదు.  దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామకార్యదర్శి అనురాధ  పదిమంది లబ్ధిదారుల ఇళ్లకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయించారు. మరికొందరికి రేషన్‌ సరుకులు ఇవ్వకుండా నిలిపివేశారు. దీంతో అప్పటికప్పుడు 16 మంది మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభించారని, వారి ఇళ్లకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించామని గ్రామ కార్యదర్శి తెలిపారు.