మ‌నాలీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raped
Raped

సిమ్లా : 12వ తరగతి చదువుతున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు మూడురోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో చోటుచేసుకుంది. యువతి ఈ నెల 17న నుండి కనిపించడం లేదని ఫిర్యాదు అందిందనీ, తిరిగి 20వ తేదీన కనిపించిందని పోలీసులు తెలిపారు. కాగా మొదట్లో తనపై అత్యాచారం జరిగిందని ఎలాంటి ఆరోపణలు చేయలేదని, యువతిని విచారించగా పంజాబ్‌కు చెందిన ముగ్గురు యువకులు, స్థానికులు తనపై అత్యాచారం చేసినట్లు వెల్లడించిందని కులు పోలీస్‌ సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. పంజాబ్‌కు చెందిన యువకులను పోలీసులు అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. యువతి మైనర్‌ కావడంతో ఐపిసి సెక్షన్‌, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.