మ్యూజిక్‌ ఎప్పుడూ ఛాలెంజింగే:

ANOOP RUBENS-1
ANOOP RUBENS

మ్యూజిక్‌ ఎప్పుడూ ఛాలెంజింగే:

అనూప్‌రూబెన్స్‌ ఇపుడు మోస్ట్‌ హ్యా పెనింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.. ఒకవైపు పెద్ద హీరోల చిత్రాలు చేస్తున్నాడు.. మరోవైపు తన వద్దకు వచ్చిన అవకాశాలను వదులుకోవటానికి ఇష్టపడటం లేదు.. పైగా ప్రతి ట్యూన్‌లోనూ కొత్తదనం ఉండేలా ప్రయత్నిస్తున్నారు.. తాజాగా ఆయన రానాతో నేనే రాజు నేనే మంత్రి చేశాడు.. బాలకృష్ణ సినిమా పైసావసూల్‌ చేస్తున్నారు.. అఖిల్‌ చిత్రంలో చేతిలో ఉంది. ఈ క్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

నేనే రాజునేనే మంత్రి .. చాలా మంచిస్క్రిప్టు అనుకున్నట్టుగానే హిట్‌ అయ్యింది..పొలిటికల్‌ థ్రిల్లర్‌ తీస్తున్నట్టు తేజగారు చెప్పారు. నాకేమో ఇలాంటి జోనర్‌ సినిమా తొలిసారి.. అందుకే ఎగ్జయిట్‌ అన్పించింది.. మ్యూజిక్‌ కూడ డిఫరెంట్‌గా చేయాలనుకున్నా.. చాలా ట్యూన్లు కంపోజ్‌ చేశా.. నేను ఎంత తాపత్రయంతో చేసినా, సినిమాకు ఏం కావాలో తేజగారికి చాలా బాగా తెలసు.. అందుకే ఆయన వాటినే ఎంపిక చేసుకున్నారు.
తేజగారితో ఇంతకు ముందు సావిత్రి అనే చేయాల్సింది.. అది వర్కవుట్‌ కాలేదు.ఆ సినిమా కోసం అప్పట్లో ఆరు పాటలు చేశాం.. వాటిలో రెండింటిని ఈసినిమా కోసం వాడాం.. జోగేంద్ర, దేవుడితో, పాటలు అలా తీసుకున్నవే.. తేజగారితో కొన్ని ఏళ్లుగా ట్రావెల్‌ అవుతున్నా.. దాంతోనే ఈసినిమా కంపోజ్‌ చేయటం ఈజీ అయ్యింది.
రానాతో పనిచేయటం నాకు ఇది తొలిసారి.. రానా నిగర్వి.. హీరో అనే భావనే ఆయనలో ఉండదు.. ఈసినిమాకు పనిచేయటం వల్ల ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా.
పూరిసార్‌తో చాలా సినిమాలు చేశాను.. ఆ క్రమంలోనే పూరిసార్‌ పైసా వసూల్‌కి పిలిచారు.. ఈసినిమాలో బాలయ్యగారు ఒక మంచి పాట కూడ పాడారు.. చాలా బాగా పాడారు.. ఆయనతో పాట పాడించాలనే ఐడియా నాదీ, పూరిగారిదీ,, బేసిగ్గా బాలయ్యగారికి సంగీతం అంటే ఇష్టం..సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ సమయంలోనూ ఆయన పాల్గొంటారు.
అఖిల్‌తో కూడ ఓ సినిమా చేస్తున్నాను. అందులోనూ అఖిల్‌తో ఓ సినిమా పాట పాడాను..
కొత్త దర్శకుడితో పనిచేసినా.. సీనియర దర్శకుడితో పనిచేసినా సంగీతం ఎపుడూ చాలెంజింగ్‌గా ఉంటుంది.. ప్రతి దర్శకుడికి ఓ స్టైల్‌ ఉంటుంది. ఆ స్టైల్‌లో ట్యూన్‌ చేయటం ఓ సంగీత దర్శకుడిగా చాలెంజింగ్‌గా ఉంటుంది.. ఇప్పుడొస్తున్న వాళ్లలో చాలా మంది కొత్త థాట్స్‌తో వస్తున్నారు.. దాని ప్రతిఫలమే ఇపుడు కొత్తదనం వస్తోంది.. ఎప్పటికపుడు నేను కూడ సంగీతపరంగా అప్‌డేట్‌ అవుతున్నాను..