మోహన్‌ భగవత్‌ను కలుసుకున్న అమిత్‌షా

amith sha, mohan bhagawat
amith sha, mohan bhagawat

నాగపూర్‌: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈరోజు ఉదయం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను కలుసుకున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంపై ఉభయులూ చర్చించినట్టు తెలుస్తోంది. రామాలయం నిర్మాణంపై చట్టం చేయాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఇందుకోసం బీజేపీ చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీల నుంచే కాకుండా, శివసేన, వీహెచ్‌పీ, తదితరుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో మోహన్ భగవత్‌ను అమిత్‌షా కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమాచారం కలుసుకున్నట్లు తెలుస్తుంది.