మోసాల నుంచి కెసిఆర్‌ పరిపాలన మొదలైంది

MANDA KRISHNA
MANDA KRISHNA

కెసిఆర్‌ పరిపాలన మోసాల నుంచి మొదలైంది

బౌద్ధనగర్‌,: అవినీతితో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిని మరిచి మరోమారు మోసా నికి తెరతీసిందని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌) వ్యవస్థాప కులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.జరగనున్న ఎన్నికల్లో వర్గికరణకు సహకరించే పార్టాలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు.ఐదు నెలలో జరిగే పార్టమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను విస్మరించి తెలంగాణ రాష్ట్రం ముందస్తుంగా ప్రభుత్వాన్ని రద్దుచేసి ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపడానికి సిద్దమయ్యారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా అందరికంటె ముందుగా జమిలీ ఎన్నికలకు సై కోట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ అందరికంటె ముందుగా ఎన్నికలకు పోవడంలో అంతర్యమేంటన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన అభివృద్ది ఎమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.అభివృద్ది కుంటు పడడంతోపాటు అధికారులంతా పనులు వదిలి ఎన్నికలలో మునిగి తేలడంతో పాటు వందల కోట్ల రూపాలయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నరని ఆవేధన వ్యక్తంచేశారు.కెసిఆర్‌ మాటలకు చేతలకు పొంతన లేకుండా చేస్తున్న పనులు ముందస్తు ఎన్నిపకలని ఎద్దేవాచే శారు.మిగుల బడ్జెట్‌ రాష్ట్రం ,ధనిక రాష్ట్రం అంటూ దేశానికి ప్రచారం చేసుకుంటున్న కెసిఆర్‌ కుటుంబం షెడ్యూల్‌ కులాల వర్గికరణ విషయంలో మృతిచెందిన భారతి మాదిగకు ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏ ఒక్కటి నేరవేర్చలేదన్నారు.భారతి కుటుంబానికి ఇస్తానన్న రూ.25 లక్షలు ఇవ్వలేదని,అఃల పక్ష్యాన్ని డిల్లీకి తీసుకువెల్లలేదు,భారతి కుటుంబంలో పిజి చదివిన కూతురుకు గాని చెల్లెలికిగాని ఉద్యోగం ఇవ్వలేదని మండిపడారు.మాటలతో మోసాలతో పాలన కోనసాగతుందని కెసిఆర్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు.