మోదీ చేసిన ప్రగతి పనులే గెలిపించింది: నిర్మలా

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ చేసిన ప్రగతియే కన్నడనాటలో బిజెపిపి గెలిపించిందని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కన్నడలో బిజెపి విజయంపై మాట్లాడుతూ కాంగ్రస్ విభజన రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. మోదీపై నమ్మకంతో కర్ణాటక ప్రజలు బిజెపిని ఎలిపించారని మరో కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. కన్నడలో గ్రామీణ, నగర ప్రజలు బిజెపికి అండగా నిలిచారని తెలిపారు. కర్ణాటకను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు.