మోదీ ఎంతో నిబ‌ద్ద‌త గ‌ల వ్య‌క్తిః ప్ర‌ణ‌బ్

modi and pranab
modi and pranab

ఢిల్లీః ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌న‌దైన రీతిలో క‌ష్టించి ప‌నిచేస్తారంటూ మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. త‌న ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో ఆయ‌న‌కు చాలా నిబ‌ద్ధ‌త ఉంద‌ని, త‌న విజ‌న్‌ను సాధించడంలో మోదీ పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉన్నార‌ని తెలిపారు. శ్రమించే తత్త్వం, దృఢనిశ్చయం ఆయ‌నలో ఉన్నాయ‌ని కొనియాడారు. పరిపాలన, రాజకీయాలు, విదేశాంగ విధానాల్లోని చిక్కులను ఆయన స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కుంటున్నార‌ని, మోదీకి పార్లమెంటులో అంతకుముందు ఎటువంటి అనుభవం లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న రాణిస్తున్నార‌ని అన్నారు. మోదీ ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసేట‌ప్పుడు సార్క్‌ దేశాల అధినేత‌ల‌ను ఆహ్వానించి ప‌క్క దేశాల ప్ర‌భుత్వాల‌తో స‌త్సంబంధాలు పెంచుకునే విష‌యంలో చ‌క్క‌గా వ్య‌వ‌హ‌రించార‌ని ప్ర‌ణ‌బ్ తెలిపారు.