మోదీ అనుకున్న సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మించలేరు

kapil copy
kapil sibal

ఢిల్లీ: రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో అయోధ్య భూమి వివాదంపై వాదనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సున్నీ వక్ఫ్‌ బోర్డ్‌ తరపున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ వాదించారు. దీనిపై ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో రామాలయం ప్రధాని మోదీ అనుకున్నప్పుడు రాదని, శ్రీరాముడు కోరుకున్నప్పుడే వస్తుందని అన్నారు. మోదీ అనుకున్న సమయంలో అ అలయాన్ని నిర్మించడం కుదరదని చెప్పారు. శ్రీరాముడిని బీజేపీ నేతలు, మోదీ నమ్ముతున్నారని, కానీ శ్రీరాముడు మాత్రం వీరిని నమ్మడం లేదని అన్నారు.