మోదీతో కేసిఆర్‌ సమావేశం

KCR,  MODI
KCR, MODI

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సియం కేసిఆర్‌, ప్రధాని నరేంద్ర మోది ఈ రోజు మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సియం మోదితో పలు కీలక అంశాలు ప్రస్తావించనున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, కొత్త జోన్ల విధానం , ఎస్టీ ముస్లిం రిజర్వేషన్ల పెంపు ,ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీలో చర్చించనున్నారు. పంటకు మద్దతు ధర పెంచాలని ప్రధానిని కోరనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలనున సియం ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని ఎన్ని అంశాలకు పచ్చ జెండా ఊపుతారో వేచి చూడాల్సి ఉంది.