మోది పాల‌న ,బ్రిటిష్ పాల‌న‌ను త‌ల‌పిస్తుందిః ఏపిసిసి ఛీఫ్‌

N Raghuveera reddy
N Raghuveera reddy

హైద‌రాబాద్ః టీఆర్‌ఎస్‌, టీడీపీ, వైఎస్ఆర్‌సిపికు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. గాంధీ భవన్‌ వద్ద చేపట్టిన కాంగ్రెస్‌ దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలు దగ్గరపడ్డాయి కాబట్టీ దళితుల గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మోది పాలన చూస్తుంటే బ్రిటీష్‌ పాలన గుర్తొస్తోందని విమర్శించారు. విభజించు పాలించు అనే నినాదాన్ని బీజేపీ ఎంచుకుందన్నారు.