మోది, జైట్లీపై రాహుల్‌ ఫైర్‌

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: భారత ఆర్ధిక వ్యవస్థ తిరోగమనానికి ప్రధాని మోది , ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ మేథస్సే కారణమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఈ సందర్బంగా ,జిడిపికి రాహుల్‌ గాంధీ కొత్త భాష్యం చెప్పారు. మోది దృష్టిలో జిడిపి అంటే స్థూల ఆర్థిక వృద్ధి కాదని… స్థూల విభజన రాజకీయాలని ఆయన దుయ్యబట్టారు. అరుణ్‌ జైట్లీ మేథస్సు, మోది జిడిపి కలిసి మన దేశానికి ఇచ్చింది ఇవేనంటూ ఆయన లిస్ట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.