మోతమోగిన బిఎస్‌ఇ స్టాక్స్‌!

bse
bse

మోతమోగిన బిఎస్‌ఇ స్టాక్స్‌!

ముంబై, స్టాక్‌ఎక్ఛేంజిల్లో నమోదయిన బిఎస్‌ఇ ఇష్యూ ధరకంటే భారీ ఎత్తున ధరలు పలికాయి. 49శాతం అధికధరలు పలికినట్లు అంచనా. బాంబేస్టాక్‌ఎక్ఛేంజిగా పేరున్నపురాతన ఎక్ఛేంజి షేరుధరలు 35శాతం ప్రీమియంకు వెళ్లాయి. ఇష్యూధర 806 రూపాయలియితే మార్కెట్‌ధరలు 1085 రూపాయలుగా నడిచాయి. ఇష్యూధరకంటే 49శాతం ధరలు పెరిగాయని 1200కూడా ఇంట్రాడేలో వెళ్లినట్లు తేలిం ది. జాబితా అయిన నిమిషాల్లోనే ధరలు భారీ ఎత్తునపెరిగాయి. ఒకధవలో 1190వరకూ వెళ్లి ఆతర్వాత 1200కు కూడా చేరినట్లు అంచనా. ఎన్‌ఎస్‌ఇ లో 5.66 మిలియన్ల షేర్లు చేతులు మారాయి. ఈ సమ యంలో ఒకరకంగా బిఎస్‌ఇ ధరలు ఖరీదైనవిగానే భావిం చాల్సి వస్తుంది. రాబడులాధా రంగా ధరలు పద్ధతిలో ట్రేడింగ్‌ జరి గింది. కేటాయింపులు అంతగాలేనందున షేర్లకు మరింతగా డిమాండ్‌ వస్తుందని అంచ నా. దీర్ఘకాలిక ప్రాతిపదికన చూస్తే కంపెనీ స్టాక్‌ మరింతగా పెరు గుతుందని అంచనా. ఇప్పటికిప్పుడు ఈ స్టాక్‌ను అమ్మవద్దని భవి ష్యత్తులో రెట్టింపు అయ్యే అవకాశం ఉందని, 10-15శాతం కనీసం పెరుగుతుందని ఐడిబిఐ కేపిటల్‌మార్కెట్స్‌ రీసెర్చి హెడ్‌ ఎకెప్రభా కర్‌ వెల్లడించారు. ఈక్వినామిక్స్‌ వ్యవస్థాపక ఎండి జి.చొక్కలింగం మాట్లాడుతూ బిఎస్‌ఇ మౌలిక స్వరూపాన్ని చూస్తే మరింతగా ముందుకు వెళ్లకపోవచ్చని భారీ ఎత్తున పెరుగుదల ఉండదని అన్నారు. విలువల ఆధారంగా ధరలు పెరుగుతాయని, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ప్రస్తుతం వేచి ఉండాలని, స్వల్ప,మధ్యకాలిక ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరణకే మంచిదని వివరించారు. దేశంలో మొట్ట మొదటి ఐపిఒగా వచ్చిన బిఎస్‌ఇ ఐపిఒ విభిన్న కేటగిరీల ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్‌ను రేకెత్తించింది. మొత్తం 1240 కోట్ల రూపాయల ఐపిఒ ఇష్యూ 51రెట్లు అధి కంగా కొనుగోళ్లుజరిగాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 49 రెట్లు విక్రయం జరిగితే ఎక్కువ బిలియనీర్‌స్థాయి ఇన్వెస్టర్ల విభాగం 159 రెట్లు పెరి గింది. ఇక రిటైల్‌ ఇన్వెస్టర్ల విభా గంలో 6.5రెట్లు బిడ్లు దాఖలయి నట్లు ఎక్ఛేంజి గణాంకాలు చెపు తున్నాయి. తొలివిడతగా బిఎస్‌ఇ 805.806 రూపాయలు ఇష్యూధర గా నిర్ణయించింది. 2016లో మొత్తం 26 కంపెనీలు 26 వేల కోట్ల నిధులను సమీకరిస్తే బిఎస్‌ఇ ఒక్కటే అంచనాలకు మించి నిధులను సమీకరించింది. బిఎస్‌ఇపరంగా ప్రపంచం లోనే భారీ ఎక్ఛేంజిగా నిలిచింది. జాబితా అయిన కంపెనీల సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నాయి. కనీసం మూడువేల కంపెనీలు బిఎస్‌ఇలో ట్రేడ్‌ అవుతాయి. ప్రపంచంలో మార్కెట్‌ విలువలు గరిష్టస్థాయిలో ఉన్న ఎక్ఛేంజిల్లో పదవ అతిపెద్ద ఎక్ఛేంజిగా నిలిచింది. బిఎస్‌ఇ జాబితా అయిన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువలు రూ.116 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే.