మోడీ, చోక్సీలకు 200 డొల్ల కంపెనీలు

మనీలాండరింగ్‌కు ఉపయోగించారని అభియోగం
సిబిఐ, ఇడి అధికారులు మరిన్ని సోదాలు
ముంబయి: పంజాబ్నేషనల్బ్యాంకు రూ.11,400 కోట్ల కుంభకోణంలో సుమారు 200కుపైగా డొల్లకంపెనీలను వినియోగించారు. అలాగే బినామి ఆస్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూపీ లాగుతున్నారు. వీటికితోడు ఐటి శాఖ కూడా తనవంతుగా దర్యాప్తు ప్రారంభించింది. మనీలాండరింగ్కోసం ఈ డొల్ల కంపెనీలను వినియోగిస్తున్నట్లు అధికారులు నిగ్గుతేల్చారు. వజ్రాలవ్యాపారి నీరవ్‌మోడీ ఆయన బంధువు మెహుల్చోక్సి వ్యాపారంలో డొల్లకంపెనీలు కీలకపాత్రపోషించినట్లు నిఘా అధికారులు చెపుతున్నారు. మోడీ, చోక్సీ వారి కంపెనీలపై నాలుగోరోజు కూడా దాడులు చేపట్టారు. అంతేకాకుండా రెండుడజన్లకుపైగా ఉన్న స్థిరాస్తులను అటాచ్మెంట్ చేసుకోవాలని నిర్ణయించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వీరిపై కేసులు నమోదుచేసారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆదివారం సుమారు 45 ఆవరణలను తనిఖీచేసారు.జ్యూయెలరీ షోరూంలు, వర్క్‌షాపులు దేశవ్యాప్తంగా ఉన్న అన్నింటిపైనా దాడులు నిర్వహించారు. మొత్తం 29 స్థిరాస్తులు మోడీకిఆయన కుటుంబసభ్యులకు చెందినవిగా ఉన్నాయి. అంతకుముందే ఆదాయపు పన్నుశాఖ వీటిని జప్తుచేసింది. వీటిని కూడా ఇడి అధికారులు పిఎంఎల్ఎ చట్టం పరిధిలో పరిశీలిస్తున్నారు.మరికొన్ని ఆస్తులను కూడా వెనువెంటనే అటాచ్చేస్తామనిసీనియర్ ఇడి అధికారి ఒకరు వెల్లడించారు. ఇడి ఐటిశాఖలు రెండు కూడా 200కుపైగా ఉన్న డమ్మీ కంపెనీలు లేదా డొల్ల కంపెనీలను గుర్తించినట్లుఆయన వెల్లడించారు. నిధులు తీసుకునేందుకు నిధులు బదలాయించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. నిందితులుగా పేర్కొన్న వీరిద్దరూ కూడా మనీలాండరింగ్కోసం వీటిని వినియోగిస్తున్నారు. తద్వారా బినామీ ఆస్తులనుసైతం కూడబెట్టుకుంటున్నారు. భూమి, బంగారం, ఇతర విలువైన రాళ్లు రూపంలో ఆస్తులు పోగుచేసుకుంటున్నట్లు ఐటిశాఖ వెల్లడించింది. ఇడి. ఐటి శాఖలు రెండూ కూడా వీరిపై దర్యాప్తుకోసం ప్రత్యేక టీమ్‌లను నియమించాయి. ఇడివిభాగం అధికారులు బంగారం, జ్యూయెలరీ ఇతర విలువైన రాళ్లు వంటివి మొత్తం 5600 కోట్ల విలువైనవాటిని స్వాధీనంచేసుకున్నారు. ఐటిశాఖ కూడా శనివారం తొమ్మిది బ్యాంకు ఖాతాలను సీజ్చేసింది. గీతాంజలి జెమ్స్‌కు సంబంధించి ప్రమోటర్ మెహుల్చోక్సి ఇతరులపైరిట ఉన్న ఖాతాలను స్తంభింపచేసింది. పన్నులెగవేతపరంగా వీటిపై దర్యాప్తుచేస్తోంది. అంతేకాకుండా 20 స్థిరాస్తులను అటాచ్చేయగా 105 బ్యాంకుఖాతాలు మోడీకి చెందినవాటివిగా గుర్తించి వాటిని స్వాధీనంచేసుకున్నారు. నీరవ్‌మోడీ, ఆయన కుటుంబసభ్యులు సంస్థలు వీటిని కలిగి ఉన్నారు. మోడీ, చోక్సీ ఇతరులపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన బహుళ దర్యాప్తు ఏజెన్సీలు ఒకేసారి దర్యాప్తును చేపట్టాయి. పిఎన్‌బి చేసిన ఫిర్యాదులు ఆధారంగా మాత్రమే వీటిని చేపట్టారు. కొంతమంది బ్యాంకు ఉద్యోగుల ప్రమేయంతోనే వీటిని నిర్వహించినట్లు గుర్తించిన బ్యాంకు అధికారులుమొత్తం 18 మందికిపైగా సిబ్బంది, అధికారులను సస్పెండ్చేసారు. సిబిఐ, ఇడిలు ఈకేసును దర్యాప్తుచేస్తుండగా తాజాగా కేంద్రవిజిలెన్స్ కమిషన్ సైతం విచారణచేపట్టి సమన్లు జారీచేసింది.