మోడీ కొత్త సంవత్సర కానుక

tv-gst
tv-gst

నేటి నుంచి 23 ఉత్పత్తులపై జిఎస్‌టి తగ్గింపు అమలు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరకానుకగా కేంద్రం సుమారు 23 ఉత్పత్తులపై తగ్గించిన జిఎస్‌టి రేట్లను మంగళవారంనుంచి అమలులోనికి తెచ్చింది. 28శాతంనుంచి 18శాతానికి పన్నులు తగ్గించింది. గేర్‌బాక్సులు,వినియోగించిన టైర్లు, పవర్‌బ్యాంకులు, లిథియం ఇయాన్‌ బ్యాటరీలు, డిజిటల ్‌కెమేరాలు,వీడియోగేమ్‌ కన్సోల్స్‌, టివిలు వంటివి కూడా ఉన్నాయి. ఇక మూవీటికెట్లు, టివిలు,మానిటర్‌స్క్రీన్‌ల ధరలను సైతం తగ్గించింది. వినియోగదారులు నేటినుంచి తక్కువ మొత్త ంపన్నులుమాత్రమే చెల్లించే సదుపాయం కలిగింది. గతనెల 23వ తేదీ సమావేశమైన జిఎస్‌టి మండలి 23 ఉత్పత్తులుసేవలపై పన్నులుతగ్గిస్తున్నట్లుప్రకటించింది. 28శాతం శ్లాబ్‌ను కేవలం విలాస ఉత్పత్తులు, ఆంక్షలు ఉన్న ఉత్ప్రేరక ఉత్పత్తులు, సిమెంట్‌, పెద్దస్క్రీన్‌ టివి, ఎయిర్‌ కండిషనర్లు, డిష్‌ వాషర్లుపై ఉంచాలనినిర్ణయించింది. జిఎస్టఇ 28శాతంనుంచి 18శాతానికి తగ్గించింది. అలాగే దివ్యాంగులకు అవసరమైన ఉత్పత్తులదరలు కూడా 28శాతంనుంచి ఐదుశాతానికి తగ్గించింది. ఇక గూడ్స్‌రవాణా వాహనాలపై థర్డపార్టీ బీమా ప్రీమియం 18శాతంనుంచి 12శాతానికి తగ్గించింది. ఐదుశాతానికి చేరిన పన్నుశ్లాబ్‌లో మార్బుల్‌ ముడిసరుకు, నేచురల్‌ కార్క్‌, వాకింగ్‌ స్టిక్‌, ఫ్లైయాష్‌ ఇటుకలు వంటివి ఉన్నాయి. మ్యూజిక్‌బుక్స్‌, కూరగాయలు, శీతలీకరించిన ఉత్పత్తులు వంటి వాటిని జిఎస్‌టినుంచి మినహాయించాయి. బ్యాంకులు అందించే సేవలపై కూడా జిఎస్టఇ ఉంటుంది. బేసిక్‌ సేవింగ్స్‌ ఖాతాలు, జన్‌ధన్‌ ఖాతాలు వంటివాటిపై జిఎస్టఇ ఉండదు. ఇక ఛార్టర్డ్‌ప్రయాణాల్లో కూడా జిఎస్టఇ రేట్‌ను ఐదుశాతానికి తగ్గించారు. ఇక 100 లోపున్న మూవీ టికెట్లు 12శాతం వసూలుచేస్తారు. వందరూపాయలు పైబడినవాటికి 18శాతం వసూలవుతుంది. ఇక టివిస్క్రీన్‌లు 32 అంగుళాలవరకూ ఉన్నవి, మానిటర్లు, పవర్బఆ్యంకులు 18శాతం జిఎస్‌టి కిందకు వచ్చాయి.