మోడి, మమతాబెనర్జీ పోస్టర్లపై ఘర్షణ

mody, mamatha
mody, mamatha

కోల్‌కత్తా: ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడి పశ్చిమ్‌బెంగాల్‌లో పర్యటిసున్నారు. ఈసందర్భంగా అక్కడ బుర్ద్వాన్‌ జిల్లాలో బిజెపి కార్యకర్తలు మోడి పోస్టర్లు ఏర్పాటు చేశారు. కాగా ఈపోస్టర్లను చించేసి వాటి స్థానంలో సిఎం మమతా బెనర్జీ పోస్టర్లును పెట్టడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.యితే ఈ ఆరోపణలను తృణమూల్‌ పార్టీ తోసిపుచ్చింది. తాము పోస్టర్లను చించలేదని, బిజెపి  నేతలే సిఎం  మమతాబెనర్జీ పోస్టర్లపై నల్ల రంగు వేశారని స్థానిక పార్టీ నేతలు ఆరోపించారు. అందుకే తాము వారితో ఘర్షణకు దిగినట్లు తెలిపారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.