మోడి ఇప్పడికైనా స్పందించాలి

Chandrababu Naidu
Chandrababu Naidu

న్యూఢిల్లీ: సిఎం చంద్రబాబు ఈరోజు ఏపి భవన్‌ నుండి రాష్ట్రపతి భవన్‌ వరుకు పాదయాత్ర చేస్తున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతు ప్రధానమంత్రి మోడి దుర్మార్గంగా ప్రవర్తంచారని బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడి ప్రజల జీవితాలతో ఆడుకుటున్నారని మనోభావాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఇది మంచిదికాదని, అందుకే ఈరోజు ఢిల్లీ నడివీధుల్లో ప్రజల తరఫున నిరసన తెలుపుతూ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. మరొక్కసారి మోదీకి హెచ్చరిస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.