మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా

PARLIAMENT
PARLIAMENT

మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా

రాష్ట్రానికి మూడు రాజ్యసభ స్థానాలు
మూడు స్థానాలు దక్కించుకోవడానికి టిడిపి సర్వం సిద్ధం
వైఎస్సార్సీ ఎమ్మెల్యేలను కాపాడుకునే దిశగా అధిష్ఠానం

అమరావతి: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వెడేక్కింది.మార్చి 5న ఎన్నికల నోటి ఫికేషన్‌ జారీకావడం మార్చి 23న ఎన్నికలు నిర్వహించడం అదేరోజు ఫలితాలను విడుదల చేయనున్నారు.గతంలో ఉమ్మడి రాష్ట్రాలలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు మూడు స్థానాలు ఖాళీలు ఏర్పాడ్డాయి.

గతంలో ఆంధ్రప్రదేశ్‌నుంచి కేంద్రమాజీ మంత్రి చిరంజీవి,రాష్ట్ర మాజీ మంత్రి దేవేంద్రగౌడ్‌,కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి ఎన్నిక కాగా తెలంగాణ రాష్ట్రంనుంచి పాల్వాయి గోవర్థనరెడ్డి, సీఎం రమేష్‌నాయుడు, రాపోలు ఆనందభాస్కర్లు ఎన్నికయ్యారు.వీరందరికి ఏప్రిల్‌-మే మాసాల్లో తమ పదవీ కాలం గడువు ముగియనుంది.