మోగిన కన్నడ ఎన్నికల నగారా

KARNATAKA
KARNATAKA

మోగిన కన్నడ ఎన్నికల నగారా

కర్ణాటకలో ఎన్నికల యుద్ధానికి రణభేరి మోగింది. ఆ రాష్ట్రంలో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు శాసనసభ స్థానాలకు ఒకేదశలో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మే పన్నెండు న ఒకేరోజు పోలింగ్‌ నిర్వహించి పదిహేనో తేదీన ఫలితా లు వెల్లడించనున్నట్లు మంగళవారం ఎన్నికల సంఘం ఢిల్లీలో ప్రకటించింది.దీంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసా రిగా వేడెక్కాయి.వాస్తవంగా రాష్ట్రశాసనసభలకు ఎన్నికలు జరిగే మూడు నాలుగు నెలల మొదటి నుంచే రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు వేయడం సాధారణం. కానీ కర్ణాటక రాష్ట్రానికి సంబంధిం చిన ఎన్నికల వ్యూహాలు మాత్రం దాదాపు ఏడాది ముందు నుంచే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు.ఈసారి కర్ణాటక లో జరిగేఎన్నికల ఫలితాలు దేశ రాజ కీయాలపై ప్రభావం చూపబోతుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాకరం గా తీసుకొని పావ్ఞలు కదపడం ఏనాడో ఆరంభించాయి. అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ, కర్ణాటక పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బిజెపి, సర్వశక్తులు ఒడ్డు తున్నాయి.

ఈ ఏడాదిలోనే జరగనున్న రాజస్థాన్‌, మధ్యప్ర దేశ్‌,చత్తీస్‌గఢ్‌,మిజోరం రాష్ట్రాల ఎన్నికలతోపాటు 2019 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపైకూడా కర్ణాటక ప్రభా వం చూపబోతుండడంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధా న్యత సంతరించుకున్నది. వాస్తవంగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనే బిజెపి అతికష్టంగా అధికార పీఠాన్ని నిలబెట్టు కోవాల్సివచ్చింది.బిజెపికిగుజరాత్‌లో ఎదురుండదని అందు లో మోడీ ప్రధాన మంత్రిఅయిన తర్వాత ఆయన ప్రభంజ నంముందు ఎవరూ నిలబడలే రని భావించారు. ఎన్నికలు సమీపించేకొద్దీ బిజెపి పెద్దలకు చెమటలు పట్టాయి.ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా రంగంలోకి దిగి కాలికి బలపం కట్టుకొని సుడిగాలి పర్య టన చేశారు.

బిజెపి అధ్య క్షుడు అమిత్‌షా అయితే అక్కడే మకాం వేసి తన శక్తియు క్తులన్నీ ఉపయోగించారు. మొత్తంమీద అతికష్టంగా విజ యం దక్కించుకునేరనే చెప్పొచ్చు. దీంతో ప్రధాని మోడీ ప్రభంజనానికి ఎదురుగాలి ప్రారంభమైందని బిజెపి పెద్దల కే అర్థమైంది. ఆతర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో బిజెపి పరాజయం ఆ పార్టీనేతలే జీర్ణించు కోలేకపోయారు.అందులోనూ బిజెపి పెట్టనికోటగా భావించే స్థానాల్లో పరాజయం పాలయ్యారు.ఆరాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఖాళీ చేసిన స్థానాలు కోల్పోవడం బిజెపి శ్రేణుల్లోనే కాదు ఉన్నత నాయకత్వాన్ని కూడా ఆలోచనలో పడేసింది.

ఈ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో ఏ పరిస్థితుల్లోనూ అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఏడాదిక్రితం నుంచే పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఒకవ్యూహం ప్రకారం పావ్ఞలు కదుపుతున్నారు. ఇందులో విజయం సాధించి తద్వారా బిజెపికి ప్రజల్లో ఆద రణ తగ్గలేదని సంకేతాలు ఇవ్వాలన్న సంకల్పంతో చెమట పట్టే శ్రమే చేస్తున్నారు.ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మంగళవారం నాడు అమిత్‌షా కర్ణాటకలోనే ఉన్నారు. ఎంతో స్థిరంగా తొట్రుబాటు లేకుండా మాట్లాడే అమిత్‌షా నిన్నటి సభలో పొరపాటుగా మాట్లాడారు.పక్కనున్న వారు చెబితే తప్ప సరిదిద్దుకోలేకపోయారు. కర్ణాటక ప్రగతికి కేంద్రంఇచ్చిన ఇస్తున్న నిధులను గణాంకాలతో సహా వివరి స్తూ అందులో అగ్రభా గం అధికారంలో ఉన్న పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. గత నవంబరు రెండు నుంచి జనవరిమూడో వారం వరకు పరి వర్తన్‌ యాత్ర పేరిట యెడ్యూరప్ప కర్ణాటకలోని మొత్తం శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఇక కాంగ్రెస్‌పార్టీ అందుకు ధీటుగానే వ్యూహాలకు,కార్యాచరణకు పదునుపెట్టింది. ము ఖ్యమంత్రి సిద్ధారామయ్య పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతూ తన ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గూర్చి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.గతఎన్నికల ప్రణాళికలో తాము చేసిన మొత్తం నూటఅరవై ఐదు వాగ్దా నాల్లో నూటయాభై ఎనిమిది అమలు చేశామని స్పష్టం చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటి కంటే ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బిజెపికి ఓట్ల బ్యాంకు గా ఉన్న వీరశైవ్ఞలు, లింగాయత్‌లను చీల్చిరాజకీయ లబ్ధి పొందాలనే వ్యూహంలో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రత్య ర్థులకు కొంత నష్టం జరుగుతుందనే చెప్పొచ్చు.లింగాయత్‌ లకుమైనారిటీ హోదా కల్పిస్తూ చేసిన ప్రకటనతో ఆవర్గాలు కాంగ్రెస్‌వైపు మొగ్గు ్గచూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది బిజెపికి కొంత నష్టం కలిగించవచ్చు.ఇక మాజీ ప్రధాని దేవగౌడ్‌ సారధ్యం లోనిప్రాంతీయ రాజకీయపార్టీ జెడిఎస్‌ పాతమైసూర్‌ ప్రాంతంలోనే ఎక్కువగా కేంద్రీకరించింది.

ఎన్నికల్లో గెలుపు కోసం ఆ పార్టీ దాదాపు రెండేళ్ల కిందట నుండే ఉత్తర కర్ణాటక బాధ్యతను జెడీయస్‌ అధ్యక్షుడు కుమారస్వామికి దక్షిణ కర్ణాటక బాధ్యతనుదేవగౌడ్‌ పంచు కున్నారు. ‘కుమారపర్వ పేరిట కుమారస్వామి పర్యటనలు ప్రారంభించి ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తాయని విస్తృతంగా ప్రచారం చేశారు.

అందుకు పొరు గునున్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలను ఉదహరిస్తూ ప్రచారం చేశారు. అంతేకాదు తమపార్టీ అధికారంలోకివస్తే రైతులుబ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నింటిని మాఫీ చేస్తా మని, విద్యా వ్యవస్థను అందరికి అందుబాటులో ఉండేవి ధంగా సమగ్రంగా మారుస్తామని తదితర హామీలతో ప్రజ లను ఆకట్టుకునేందుకు శక్తికి మించి కృషి చేస్తున్నారు. అయితే జెడియస్‌ స్వతంత్రంగా అధికారంలోకివచ్చే అవకా శాలు కన్పించడం లేదు. హంగ్‌ ఏర్పడితే మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఏదిఏమైనా ఈ ఫలితాలు అటు సార్వ త్రిక ఎన్నికలపైన ఇటు త్వరలో జరగనున్న రాష్ట్రాల ఎన్ని కలపై కూడా ప్రభావం చూపుతాయి.

– దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌