మొరాయించిన జిఎస్‌టి వెబ్‌సైట్‌

GST GENERIC

GST GENERIC

మొరాయించిన జిఎస్‌టి వెబ్‌సైట్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21:: దేశవ్యాప్తంగా వర్తక వ్యాపార సంఘాల ప్రతి నిధులు జిఎస్‌టి రిటర్నులు దాఖలుచేయాలని చూస్తేసైట్‌ పనిచేయకపోవడంతో ఆందోళనలో పడ్డారు. కొంతసమయం పాటు జిఎస్‌టి రిటర్నులు దాఖలుచేసే వెబ్‌సైట్‌ పనిచేయకమొరాయించింది. జిఎస్‌టి రిటర్నులు దాఖలకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉన్న తరుణంలో సైట్‌ మొరాయించడం వర్తకులను తీవ్ర గందరగోళంలోనికి నెట్టివేసింది. జిఎస్‌టి వెబ్‌సైట్‌ 12 గంటలవరకూ అంతంతమాత్రంగానే పనిచేస్తోంది. ట్రేడర్లను తీవ్ర గందరగోళానికి గురి చేసింది. కొంతమంది ప్రతినిధులయితే అధికారుల కు తాము ఇలా అయితే రిటర్నులు ఫైల్‌చేయలే మని తెగేసి చెప్పేసారు. ఇదే జరిగితే ప్రభుత్వం గడువుతేదీని మరోరెండురోజులపాటు పొడిగించా ల్సిన అవసరం ఉందని అసోచామ్‌ జిఎస్‌టి ఎస్‌టి ఎఫ్‌ ఛైర్మన్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు.

జులైనెలకు సంబంధించి జిఎస్‌టిఆర్‌-3బి దాఖలుకు ఆగస్టు 20వ తేదీ చివరితేదీ. బయటిప్రాంత సరఫరా, అంతర్గత సరఫరా, క్రెడిట్‌, పేమెంట్‌ వంటి వివరాలు ఈ రిటర్నులో పొందుపరిచి దాఖలుచేస్తారు. జిఎస్‌టి సైట్‌లో ఇందుకు సంబంధించి ఒక నోటీస్‌ ఉంచుతూ వెబ్‌సైట్‌ సేవలు ఈనెల 19వ తేదీ రెండు గంటల నుంచి 2.45 గంటలవరకూ పనిచేయదని, తదనంతరం మళ్లీ పనిచేస్తుందని వెల్లడిం చింది. ఇక మూడుఫారాల్లో అంటే జిఎస్‌టిఆర్‌ 1,2,3 రిటర్నులు ప్రతినెలా దాఖలుచేయాలి. జులై నెలకు సంబంధించి ఈమూడు ఫారాలు సెప్టెంబరు ఒకటినుంచి ఐదు,ఆరు, పది, 11, 15 తేదీల్లోపు దాఖలుచేయాల్సి ఉంటుంది. జిఎస్‌టిఆర్‌ వన్‌ మాత్రం బిజినెస్‌ విక్రయాలను స్పష్టంచేస్తుంది. జిఎస్‌టిఆర్‌2 రిటర్నులు కొనుగోళ్లు, జిఎస్‌టిఆర్‌3 కొనుగోళ్లు, విక్రయాలు రెండింటినీ తేటతెల్లం చేస్తుంది. ఆగస్టు నెలకుగాను ఈమూడు ఫారాలను వచ్చేనెల 16-20తేదీలమధ్య నింపాల్సి ఉంటుంది. 21-25, సెపెఓ్టంబరు 26-30 తేదీలలోపు మూడు రిటర్నులు దాఖలుచేయాలి. అంతకుముందు జూలై నెల రిటర్నులు దాఖలుచేసే తేదీని జిఎస్‌టి మండలి ఒకనెలరోజులపాటు పొడిగించిన సంగతి తెలిసిందే.