మొదటిప్రపంచ యుద్ధ విరమణ ఒప్పందానికి వందేళ్లు!

WORLD WAR
WORLD WAR

ప్రపంచ దేశాల అధినేతలతో ప్యారిస్‌లో సందడి
ప్యారిస్‌: మొదటి ప్రపంచ యుద్ధంజరిగి నేటికి సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి యుద్ధవిరమణ ఒప్పందంరోజును స్మరించుకునేందుకు ప్రపంచంలోని 70 దేశాల అధినేతలు ప్యారిస్‌ నగరంలో కలిసారు. ఆదివారం హోరున వర్షం కురుస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలనేతలు పారిస్‌లో కలుసుకుని ఆనాటియుద్ధం తాలూకు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. నాలుగున్నరేళ్లపాటుసాగిన ఈ యుద్ధం అనంతరం విరమణ ఒప్పందం వివరాలపై కూడా ప్రముఖులు చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌పుతిన్‌లతోపాటు పలువురు దేశాధినేతలు 1918నాటి యుద్ధవిరమణ ఒప్పందానికి వందేళ్లు నిండాయని ఆనాటి ఘటనలు గుర్తుచేసుకున్నారు. ప్యారిస్‌ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు నేతలందరూ స్మారక చిహ్నం వద్దకువచ్చారు. చర్చి గంటలు ఫ్రాన్స్‌మొత్తంగా మోగాయి. ఒక గుర్తుతెలియన సైనికుని స్థూపం వద్ద నేతలందరూ చేరి అక్కడ వేడుకగా నిర్వహించారు. ప్యారిస్‌లోని ఆర్‌డి ట్రంఫ్‌ స్మారక స్థూపం వద్దకు చేరారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ 20 నిమిషాల ప్రసంగంలో తన సోదర నేతలు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఆనాటి సంఘటనలు మరిచిపోకూడదని,ప్రపంచ శాంతికోసం నిర్విరామంగా కృషిజరగాలని ఆకాంక్షించారు. హింసావాదం, ఏకాకిని చేయడం, హింసనుప్రజ్వరిల్లచేయడం వంటి సంఘటనలవల్ల భావితరాలు మనల్నే బాధ్యుల్ని చేస్తాయని మాక్రాన్‌ పేర్కొన్నారు. ఇపుడు ప్రపంచంలో వెల్లువెత్తుతున్న జాతీయతనినాదం ఆనాటి సైనికులుచాటిచెప్పిన దేశభక్తికి భిన్నంగా ఉందని, జాతీయత వాదం ఒక విధ్వంసక వాదమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పరోక్షంగాప్రస్తావించారు. పాశ్చాత్యదేశాల నేతలందరి ప్రసంగాల అనంతరం నవంబరు 11వ తేదీ ఆనాటి భయంకర మొదటి ప్రపంచ యుద్ధం విరమణకు నాందిపలికినరోజుగా చరిత్రలో మిగిలిపోతుందని నేతలందరూ ప్రకటించారు. ఫ్రాన్స్‌లోనే కాకుండా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా,భారత్‌, మాంకాంగ్‌,మైన్మార్‌ దేశాల్లో కూడా ఆనాటి యుద్ధవిరమణ ఒప్పందరోజునుస్మరించుకున్నారు. ఆసియా ఆఫ్రికా దేశాల్లోని సామ్రాజ్యవాద దేశాలనుంచి వచ్చిన మిలియన్లకొద్దీ సైనిక బలగాలతో ప్రపంచ యుద్ధం నాలుగున్నరేళ్లు కొనసాగింది. కామన్‌వెల్త్‌ దేశాలకు సంబంధించిన సైనికబలగాలను ఆనాడు బ్రిటిష్‌ కమాండ్‌ గా వందేళ్లక్రితమే స్థాపించారు. ఈసందర్భంగా కూడా బ్రిటన్‌నేతలు ఆనాటి గుర్తులను మననం చేసుకున్నారు. శాంతికోసం జరిగిన పోరాటంలో భారత్‌ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ సైనికులు శాంతిపరిరక్షణకు కృషిచేస్తున్నారని భారతప్రధానిమోడీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రేపటి భవిష్యత్తుకోసం వారి ప్రస్తుత జీవితాలను త్యాగంచేసారని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌మారిసన్‌ వెల్లడించారు. బ్రిటన్‌ప్రధాని థెరిసామే, ప్రిన్స్‌ ఛార్లెస్‌ క్వీన్‌ ఎలిజబెత్‌లు లండన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటియుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు వారు ఘనమైన నివాళి అర్పించారు. ప్యారిస్‌లో జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెల్లా మార్కెల్‌ , ఐక్యరాజ్యసమితి సెక్రడరీజనరల్‌ ఆంటోనియో గ్యుట్టరెస్‌లుసైతం ప్రపంచ శాంతిపై ప్రసంగించారు. ప్యారిస్‌లోని పీస్‌ఫోరమ్‌ ఆదేశ అధ్యక్షుడు చేస్తున్న కృషిని శ్లాఘించింది. అంతర్జాతీయ సంస్థలు వివాదాలను పరిష్కరించుకునేందుకు కృషిచేయాలని, యుద్ధాలను అధిగమించి సామరస్యవాతావరణం పెంచేందుకు కృషిజరిగిందని కొనియాడారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు తనను కించపరిచినట్లుగా భావించారు. మాక్రాన్‌ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యూరోపియన్‌ సైన్యం అవసరం ఉందని, అమెరికా,రష్యా,చైనాలవంటి దేశాలనుంచి వచ్చే ముప్పును అధిగమించేందుకు యూరోపియన్‌ కూటమి మొత్తంగాప్రత్యేకసైన్యం ఆవిర్భవించాలని చేసిన ప్రసంగం ట్రంప్‌కు కోపం రప్పించింది. అయితే తన వ్యాఖ్యలు తప్పుగా అర్ధంచేసుకున్నారని, యూరోప్‌ సొంత రక్షణకోసం భద్రతను పెంచుకోవాల్సి ఉందని మాత్రమే చెప్పానని ప్రకటించడంతో కొంత సద్దుమణిగింది. అమెరికాఫస్ట్‌ నినాదంతో వచ్చిన నేత ట్రంప్‌ శనివారం వర్షం కారణంగా అమెరికన్‌ స్మశానవాటికకు వెళ్లి సంతాపం తెలిపే కార్యక్రమాన్ని రద్దుచేసుకోవడంపై పీస్‌ఫోరమ్‌ విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. పారిస్‌ మెమోరియల్‌ సర్వీస్‌, ఫోరమ్‌ ప్రముఖులతోపాటు టర్కి అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌,కెనడా ప్రీమియర జస్టిన్‌ట్రుడావు, ఇజ్రాయిల్‌ప్రధానిబెంజమిన్‌ నెతన్యాహులతోపాటు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. 2015లో జీహాదిలు పదేపదే దాడులు నిర్వమించిన ఈ నగరంపై ఈ కార్యక్రమం ఆసాంతం భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లుచేసారు. సుమారు 70కిపైగా దేశాల నేదలు ఈ యుద్ధ విరమణ ఒప్పందరోజు స్మృతికి హాజరయ్యారు. ఆనాటి యుద్ధంలో పదిమిలియన్ల సైనికులకుపైగా చనిపోగా 20 మిలియన్లమందికిపైగా తీవ్ర గాయాలపాలయినట్లు గణాంకాలుచెపుతున్నాయి.