మొటిమలకు దూరంగా…?

PIMPLES
PIMPLES

మొటిమలకు దూరంగా…?

మొటిమలు ఎక్కువగా ఆయిల్‌ ఫుడ్‌ తినేవారిలో వస్తాయి కాబట్టి ఆయిల్‌ఫుడ్‌ను వీలైనంతవకూ తగ్గించుకునేలా చూడాలి. మొటిమలు ఎక్కువగా ముఖం మీద ఉండే బ్యాక్టీరియా వల్ల వస్తుంటాయి. కాబట్టి ముఖాన్ని ఎప్పటి కప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కుని పొడిటవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ్క మొటిమలు ఉన్నవారు వాటిని సూది, పిన్నీసు వంటి వాటితో పొడుస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల దీనిలో ఉండే బ్యాక్టీరియా ముఖంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంది. ్క మొటిమలు వాచి నొప్పి పెడుతుంటే ఐస్‌క్యూబ్‌ను వాటిపై మెల్లిగా రుద్దుతుంటే కొంచెం ఉపశమనం లభిస్తుంది. ్క కొంచెం నీటిలో దాల్చిన చెక్కపొడి వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకుని మొటిమలు పట్టిస్తే ఫలితం కనపడుతుంది. ్క మొటిమలు ఎక్కువగా ఉన్నవారు మాంసాహారం తగ్గించాలి. ్క నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా మొటిమలు రాకుండా చూసుకోవచ్చు. ్క మొటిమలు ఉన్నాయి కదా అని ఏ క్రీం పడితే అవి రాసెయ్యకూడదు. దీనివల్ల మీ ముఖం ఇన్ఫెక్షన్‌ బారినపడే ప్రమాదం ఉంది. ్క టమాటపండు రసం తీసి మొటిమల మీద రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది. ్క కొంచెం నిమ్మరసంలో వేపాకు పొడివేసి బాగా కలుపు కుని మొటిమల మీద రాస్తే మొటిమల నుండి విముక్తి పొందవచ్చు. ్పుండి విముక్తి పొందవచ్చు.