మొగ్గలోనే క్రమశిక్షణ మొదలు

FEEDONG
Mother wiht Child

మొగ్గలోనే క్రమశిక్షణ మొదలు

పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలని టీచర్స్‌స్కూల్‌లో చేసే ప్రయత్నాన్ని పిల్లలు సులువ్ఞగా అంగీకరించాలంటే ఇంటి దగ్గర అదేరకమైనటువంటి క్రమశిక్షణ అలవాటు ఉండాలని, తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లలకు త్వరగా అర్థమవ్ఞతాయని, అందుకనే క్రమశిక్షణ అనేదాన్ని తల్లిదండ్రులు ఇంటి నుంచే మొదలుపెట్టాలని చిల్ట్రన్స్‌ సైకాలజిస్టులు అంటున్నారు.

ఇంటిదగ్గర ఒక సమయానికి నిద్రలేవటం, బ్రష్‌ చేసుకోవటం, పాలు తాగటం వంటివి క్రమం ప్రకారం అలవాటు చేయబడిన పిల్లలు స్కూల్‌ గంటలను కూడా గౌరవించగలుగుతారని వారంటున్నారు. పిల్లలకు క్రమశిక్షణ అలవాటు చేయడానికి ఏమేమి చేయాలో తెలుసుకుందాం. స్కూల్‌ తొలిరోజుల్లో ఆటపాటలు అధికంగా ఉంటాయి.

కాబట్టి పిల్లలకు ఆనందంగానే ఉంటుంది. అయితే క్రమంగా చదవటం, రాయటం, కంఠస్థం చేయటం, తిరిగి చెప్పటం అనేవి మొదలు పెట్టగానే స్కూల్‌ పట్ల విముఖత ప్రదర్శిస్తారు. చాలామంది పిల్లలకి చదవటం, కొత్త విషయం తెలుసుకోవటం పట్ల ఆసక్తి లేకపోవటం అనేది ఇంటి వాతావరణాన్ని బట్టే వస్తుంది. స్కూల్‌కి వెళ్లటం, చదువ్ఞకోవటం అవసరమనే విషయం పిల్లలకు తెలియచెప్పాలి. కొత్త పుస్తకాలు అందించటం, రంగు రంగుల బొమ్మల పుస్తకాలతో ఆసక్తి కలిగించటం, కథలు చదివి వినిపించటం వంటివి చేయటం వల్ల పుస్తకాల పట్ల, చదువ్ఞ పట్ల పిల్లలలో ఆసక్తి పెరుగుతుంది.

తాము అంతవరకు ఇంటి దగ్గర చేస్తున్నదే స్కూల్‌లో కూడా చేయబోతున్నామనే నమ్మకం వారికి తప్పక కలుగుతుంది. ఒత్తిడి పెంచకూడదు పిల్లలు బాగా చదవాలని మంచి మార్కులు తెచ్చుకోవాలనే కోరిక తల్లిదండ్రులకు ఉండటం సహజం. ఆ కోరిక పిల్లలలో కూడా కలిగేలా చేయగలిగితే వారు క్రమంగా ఆసక్తి పెంచుకుంటారు. అంతేకాని మార్కులకున్న విలువ ఏమిటో, ర్యాంకులకు అర్థం ఏమిటో తెలియని వయసు పిల్లలను వాటికోసం సతాయించటంలో అర్థంలేదు.

అర్థంలేని క్రమశిక్షణ, అందుకోలేని లక్ష్యాలను పిల్లల ముందుంచితే వారి జీవితాలను నాశనం చేయటమే అవ్ఞతుంది. మానసికంగా వారు గురవ్ఞతున్న ఒత్తిడి పిల్లలకు చదువ్ఞ పట్ల ఏహ్యభావాన్ని పెంచుతుంది. స్కూల్‌ ఎలా మానేద్దామా అని ఆలోచిస్తుంటారు. పిల్లలను ప్రతి చిన్న విషయంలో ప్రోత్సహించటం మంచిది. వారు సాధించిన ప్రతి చిన్న అంశాన్ని అభినందించాలి. వారి తోటివారితో పోల్చి చిన్నబుచ్చటం మంచిది కాదు. ఈతరం పిల్లలు బాల్యం నుండే మానసిక ఒత్తిడికి, అభద్రతా భావానికి గురవ్ఞతున్నారు. తల్లిదండ్రులిరువ్ఞరూ ఉద్యోగాలు చేస్తూ, వారి దినచర్య ఏమాత్రం తీరికలేని విధంగా సాగిస్తున్నారు.

పిల్లలకోసం సమయం కేటాయించలేని తల్లిదండ్రులున్న కుటుంబ వాతావరణంలో పిల్లలు భయాందోళనతో దేనిమీదా దృష్టి నిలపలేకపోతున్నారు. అటువంటి వాతావరణం నుండి వచ్చిన పిల్లలు భయాందోళనలతో మందకొడిగా తయారవ్ఞతారు. మరికొందరు వాటిని కప్పిపుచ్చుకునేందుకు నలుగురిలో ఉన్నప్పుడు అతి చలాకీగా, ఒంటరిగా ఉన్నప్పుడు మూడీగా రెండు రకాల స్వభావాలు ప్రదర్శిస్తుంటారు. వారిలో సమస్య అనేది పేరుకుని ఉందనే విషయం గుర్తించకపోతే అది క్రమంగా పెద్దదవుతుంది.

స్కూల్‌లో పరిస్థితులు: స్కూల్‌ వాతావరణం నచ్చక కూడా పిల్లలు వెనకపడుతుంటారు. తగిన స్కూల్‌లో చేర్చటం తల్లిదండ్రుల బాధ్యత. చక్కని వాతావరణంలో ఆకర్షించే స్కూల్‌కి వెళ్లేందుకు పిల్లలు ఎంతో ఇష్టపడతారు. స్కూల్‌ గురించి అక్కడి పరిస్థితి గురించి వాకబు చేసి చేర్పించాలి. ఆ స్కూల్‌లో ఆటస్థలం, పాటలు వంటి అదనపు శిక్షణలకు సౌకర్యం ఉందా, ఎందరు విద్యార్థులు ఉన్నారు. స్కూల్‌లో బోధించే పద్ధతి ఎటువంటిది చూసుకుని మానసిక వికాసాన్ని పెంచే వాతావరణం ఉన్న పాఠశాలలోనే చేర్పించాలి. బాల్యంలో ఆటపాటలకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. నేటి స్కూళ్లలో ఆటస్థలం కరువవ్ఞతున్నది.

ఆటలకు స్థానం లేనటువంటి స్కూల్‌ పిల్లలకు ఒక బందిఖానాలా ఉంటుంది. అన్ని అంశాలను గమనించి స్కూల్‌లో చేర్చిన తర్వాత ఇక తమకు బాధ్యత లేదని తల్లిదండ్రులు అనుకుంటే పొరపడినట్టే. స్కూల్‌ వాతావరణానికి అలవాటుపడేవరకు పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి. స్కూల్‌ వాతావరణం ఇబ్బంది కలిగిస్తున్నదనే విషయం పిల్లల ప్రవర్తన ద్వారా తెలిసిపోతుంది. స్కూల్‌లో ఇచ్చిన హోమ్‌వర్క్‌ని పూర్తిచేయకపోవటం, నిర్లక్ష్య ప్రదర్శన, పుస్తకాలను విసిరివేయటం, ఇతర పిల్లలతో పోట్లాట, చిరాకు, వస్తువ్ఞలు పాడు చేయటం వంటి లక్షణాలు కనిపిస్తే పిల్లల్లో సమస్య ఉన్నట్టు. కావాలని తప్పుచేసి శిక్షించేలా చేస్తూ తమ నిరసనను తెలియచేస్తుంటారు. మరింత ఎక్కువ దండనతో లొంగుతారను కుంటారు. కానీ దానివలన సమస్య జటిలమవుతుంది.

స్కూల్‌లో పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏమిటో గమనించి దాన్ని తొలగించాలి. కుదరకపోతే పిల్లలనే ఆ స్కూల్‌ నుండి తప్పిం చాల్సి ఉంటుంది. స్కూల్స్‌లో టీచర్‌ ప్రవర్తన, తోటిపిల్లల స్నేహం పిల్లల భయాలను పోగొడతాయి. చేస్తూన్న ఉద్యోగం పట్ల శ్రద్ధలేని టీచర్స్‌, తమ స్థాయికన్నా తక్కువ స్థాయి ఉద్యోగంలో ఉన్నామ నుకునే టీచర్స్‌వల్ల పిల్లలలో సమస్యలు పెరుగుతు న్నాయి. స్కూలుకు వెళ్లమని మారాం చేసున్నారు. పిల్లల పట్ల ప్రేమ ప్రదర్శించే టీచర్స్‌ని తల్లిదండ్రులకన్నా ఎక్కువ గౌరవిస్తారు పిల్లలు. మంచి టీచింగ్‌ విధానాలు తెలిసినవారు కలిగిన స్కూల్‌లో చేర్చటం మంచిది. స్నేహం అనేది తమతో సమానులనిపించినవారితోనే చేస్తారు. నలుగురిలో కలవటం అనేది స్కూల్‌కి వెళ్లే ముందు నుండే అలవాటు చేయాలి.

ఇంటి దగ్గర ఇరుగు పొరుగు పిల్లలతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహిస్తే స్కూల్‌ వాతావరణానికి త్వరగా అలవాటుపడతారు. ఇతరుల మీద పెత్తనం చెలాయించే గుణం ఉన్నా లేక మరీ లొంగినట్లుగా ఉన్నా స్నేహాలు చేయలేరు. స్కూల్‌లో తగిన స్నేహాలు అవకపోతే ఆ వాతావరణం నచ్చదు. స్కూల్‌కి వెళ్లేందుకు భయపడతారు. కాబట్టి స్కూల్‌లో పిల్లల ప్రవర్తన ఎలా ఉంటున్నదీ తెలుసుకుంటుండాలి. స్కూల్‌లో చేర్పించిన తొలి సంవత్సరంలో ఆ క్లాస్‌ టీచర్‌ని తల్లిదండ్రులు తరచుగా కలుసుకోవటం మంచిది. తాము అంతవరకు చూడని ఒక కొత్తకోణం నుండి పిల్లలను చూస్తుంది టీచర్‌. కాబట్టి పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి సమస్యలు ఎటువంటివో చెప్పగలుగుతుంది. వాటిని సరిదిద్దే ప్రయత్నం తల్లిదండ్రులు చేయగలగుతారు.