మొక్కల ప్రాముఖ్యత!

బాల గేయం

medicain

మొక్కల ప్రాముఖ్యత!

ఒక్క మొక్క నాటుము పుడమి పచ్చ చేయుము చేయి చేయి కలుపుము చెట్లు ఎన్నో పెంచుము గుడుల వద్ద, బడుల వద్ద గుట్టపైన గట్టు పైన చెట్టు చేమ పెంచుము కంచె చుట్టు కట్టుము నిత్యం నీళ్లు పోయుము చెట్లు పచ్చ చేయుము పాప వలె పెంచుము పదిమందికి చెప్పుము చెట్లతోనె వాన వచ్చు చెర్లు నిండి పొర్లును పంటలెన్నొ పండును పల్లె పరవశించును ప్రాణికోటి జీవమునకు ప్రాణభిక్ష పెట్టును రైతు హర్షమొందును కరువ్ఞ తీరిపోవు మేఘమాల నందనం వృక్షతల్లి వందనం

– ఎల్‌. శ్రీవాణి