మొక్కలు రోగాలకు ఉపశమనం

plants
పొడపత్రిని మధునాశని అని, గుడమార్‌ అని అంటారు. దీని శాస్త్రీయ నామం జిమ్నియా సిల్వెస్ట్రా. దీని ఆకు తిన్న తరువాత పంచదార, బెల్లం తిన్నా ఒకటి రెండు గంటల వరకూ వాటి రుచి తెలియదు. అందుకే దీనిని మధునాశని అంటారు. దీని ఆకులను మధుమేహంలో వాడుతారు. పచ్చి ఆకులు నమలడం మంచిది. ఎండు ఆకుల చూర్ణం ఒకటినుండి రెండు గ్రాములు రెండుపూ టలా వాడాలి. హోమియో వైద్యంలో కూడా దీని మదర్‌ టింక్చర్‌ ఉంది. ఆకులను వాపులు, దెబ్బలకు పైన కట్టడానికి వాడుతారు. పొడ పత్రి పై అనేక పరిశోధనలు జరిగాయి. ఇది ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగేట్లు చేస్తుందని మద్రాసులో జరిగిన ఒక పరిశోధనలో గమనించారు. ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచే మరొక మందు మొక్క విజయ్ సార్‌.
విజయ్ సార్‌ : దీనిని వేగిస అని అంటారు. వేగిస చెక్కను తలుపులు తయారు చేయడానికి వాడుతారు. ప్రమేహం, చర్మవ్యాధులు, రక్త వికారాలలో వేగిసను ఉపయోగిస్తారు. వేగిస చెక్క కషాయం మధు మేహంలో ఉపయుక్తం. 10 గ్రాముల చెక్క మరిగే నీటిలో ఉంచితే పచ్చగా కషాయం వస్తుంది. గోరు వెచ్చని కషాయం రెండుపూటలా వాడాలి. వేగిస చెక్కతో చేసిన గ్లాసులో నీళ్లు పోసి ఉంచి చాలా మంది తాగుతుంటారు. వేగిసపై అనేక పరిశోధనలు జరిగాయి. మధుమేహాన్ని తగ్గించే మందులలో వేగిస ముఖ్యమైనది. ఇది ఇచ్చిన ప్పుడు ప్రేవుల నుంచి గ్లూకోజ్‌ శోషణం తక్కువైనట్లు గుర్తించారు. ఫాస్టింగ్‌ బ్లడ్‌సుగర్‌లోనూ, గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌లోనూ దీని ఫలితాలు గుర్తించారు. కుందేళ్లపై జరిగిన పరిశోధనలో 3 నుంచి 5 గంటల తరువాత గ్లూకోజ్‌ పరిమాణం తగ్గినట్లు చూశారు.
వేప : అమెరికన్లు పేటెంట్‌ చేసుకున్న వేప భారతదేశంలో అనేక చోట్ల అనేక వేల సంవత్సరాలుగా వాడబడుతున్న ఔషధం. ఆయుర్వే దంలో దీనిని నింబ అంటారు. వేప ఆకులను మధుమే హం ఉన్న వారు చాలామంది తింటారు. వేప ఆకుల కషాయం రక్తంలో సుగర్‌ ను తగ్గిస్తుందని అనేక పరిశోధనలలో గుర్తించారు. వేప ఆకులు తామర, గజ్జి, ఎగ్జిమా వంటి వ్యాధులను తగ్గిస్తుంది. వేప కడుపులో పురుగులను కూడా తగ్గిస్తుంది. వేపలో ఉండే నిండిడిన్‌ అనే చేదు తత్వం జ్వరాన్ని తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో వేపను మలేరియా జ్వరంలో వాడుతారు. సొరియాసిస్‌ అనే చర్మవ్యాధిలో వేప పని చేస్తుందని గుర్తించారు. ప్రేవులలో పుండును కూడా వేప తగ్గిస్తుం దని గమనించారు. వేపనూనెను యోనిలో ఉంచినప్పుడు అది గర్భం రాకుండా చేస్తుంది. హెర్పిస్‌ పొక్కులు వచ్చినవ ఆరు వేపనూనెను వాడవచ్చు. అనేక రకాల వైరస్‌ వ్యాధు లలో వేప ఉపయోగపడుతుంది. ప్రస్తుతం వేప పెస్టిసైడ్‌గా కూడా వాడబడు తోంది. వేపపుల్లలు దంత వైద్యంలో ఉపయోగప డుతాయి.
బింబి (కాకిదొండ) : దొండతీగ లాగానే ఉండి, చేదుగా ఉండే దొండను కాకి దొండ అంటారు. దీని శాస్త్రీయ నామం కాక్సిని యా ఇండికా. దీని వేరు మధు మేహంలో ముఖ్యమైన ఔషధి. భారతదే శంలో అనేక చోట్ల ఈ మొక్కపై పరి శోధనలు జరిగాయి. మధు మేహ హర ఔష ధాలలో ముఖ్యమైనది కాకిదొండ. ఇది జ్వరాన్ని, కఫాన్ని తగ్గిస్తుంది. దగ్గు, ఆయాసం మొదలైన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులలో ఇది పని చేస్తుంది. దీని ఆకులను చర్మవ్యాధుల లోనూ, జంతువులు కరచినప్పుడు ఏర్పడిన పుండ్లపై వాడుతారు. లేత కాయలు నాలిక పూచినప్పుడు నములుతారు. సిద్ధ వైద్యంలో ఈ మందును వైరల్‌ హెపటైటిస్‌లో వాడుతారు. ఈ మందు రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం తగ్గిస్తుందని పలువురు వైద్యశాస్త్రవేత్తలు గుర్తించారు.
జంబు: నేరేడు గింజలను మధుమేహంలో వాడుతారు. నేరేడు పట్ట, జిగట విరేచనాల్లో వాడుతారు. మేఘమోదిని, మహాస్కం ద, సురభి పత్ర, మహాఫల, కృష్ణఫల, కాకనేల, భ్రమేష్ట, భ్రమ రేష్ట, కాకఫల ఇవన్నీ నేరేడు పేర్లు. నేరేడు గింజలు జంతువు లలో పరిశోధనల కంటే క్లినికల్‌ ట్రయల్స్‌లోనే ఎక్కువ ఫలితాల నిచ్చినట్లు వెల్లడైంది. మామజ్జక కూడా అత్యంత చేదుగా ఉండే మొక్క. మొక్క మొత్తాన్ని కషాయం కాచి, ఆ కషాయాన్ని తిరిగి సన్నని సెగపై కాస్తే ముద్ద లాగా అవుతుంది. దీనిని మామజ్జకఘన వటి అంటారు. గుజరాత్‌ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో మామజ్జక ఘనవటిపై అనేక పరిశో ధనలు జరిగాయి. ఏకౌషధిగా కూడా మామజ్జక మధుమేహంలో ఉపయుక్తం.
తంగేడుపూలు : తంగేడు పూలు మధుమేహాన్ని తగ్గిస్తాయి.
మెంతులు : మధుమేహాన్ని తగ్గించేవాటిలో ప్రధానమైనవి మెంతులు. మెంతులు పొడి చేసి మజ్జిగతో తాగవచ్చు. మెంతుల పొడిని గోధుమపిండితో కలిపి చపాతీలుగా చేసుకోవచ్చు. జాతీయ ఆహార సంస్థలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ మెంతు లపై అనేక పరిశోధనలు జరిగాయి. మెంతులు కాలేయంపై పని చేస్తాయి. మెంతులు పుళ్లను మాన్పే గుణం కలిగి ఉన్నాయని హుబ్లీలో జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది. పాకిస్తాన్‌లో జరిగిన మరొక పరిశోధనలో మెంతులు కొన్ని రకాల బ్యాక్టీరియా ను నాశనం చేస్తాయని వెల్లడైంది. హర్యానాలోని రోథక్‌ మెడికల్‌ కాలేజీలో మెంతులపై పరిశోధనలు జరిగాయి. వేయించిన మెంతులను, వేయించని మెంతు లను ఎలోగ్జాన్‌ ద్వారా మధుమేహం కలిగించిన ఎలుకలకు వాడారు.