మొక్కజొన్న, జొన్న మద్దతు ధరలకు కొనుగోలు

CORN, JOWAR
CORN, JOWAR

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని మొక్కజొన్న, ఎర్ర జొన్న, తెల్ల జొన్నలను మద్దతు ధరలకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2017-18 సంవత్సరం రబీ సీజనుకు సంబంధించి మొక్కజొన్న, ఎర్ర జొన్న, తెల్ల జొన్నల కొనుగోలు నిమిత్తం 967.40 కోట్ల రూపాయలను రుణం కింద మార్కెఫెడ్‌ తీసుకుంది. ఈనేపథ్యంలో తీసుకొచ్చిన రుణంకు సంబంధించి వడ్డీ పెద్ద భారంగా తయారైంది. దీంతో మొక్కజొన్న, ఎర్ర జొన్న, తెల్ల జొన్నల కొనుగోలు విషయంలో మార్కెట్‌ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.